చిరంజీవి - బాలయ్య అభిమానులకి పోలీసుల వార్నింగ్     2017-01-07   01:59:11  IST  Raghu V

దశాబ్దం తరువాత చిరంజీవి – బాలకృష్ణ సినిమాలు ఒకేసారి విడుదల అవుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం వాడివేడిగా ఉంది. ముఖ్యంగా అభిమానుల భావోద్వేగాలు తారస్థాయికి చేరే సమయం ఇది. ఎప్పుడు ఎలాంటి గొడవలు జరుగుతాయో చెప్పలేని పరిస్థితి. అందుకే పోలీసులు అప్రమత్తం అవుతున్నారు.

ఈరోజు విజయవాడ – గుంటూరు హైవేలోని హాయ్ లాండ్ గ్రౌండ్స్ ఖైదీనం 150 ఫంక్షన్ జరుగుతుండటంతో, ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరక్కుండా, చిరంజీవి – బాలకృష్ణ అభిమానులకి వార్నింగ్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ పోలీసు డిపార్టుమెంట్.

అభిమానులు పర్మిషన్ లేకుండా ఎలాంటి సభలు కాని, ర్యాలిలు కాని నిర్వహించడానికి వీల్లేదని, ఎవరైనా అనుమతి లేని సభలు పెట్టినా, అవతలి హీరో మీద నెగెటివ్ బ్యానర్లు కట్టినా, సోషల్ మీడియాలో చెత్త పోస్టులు పెట్టినా, కఠిన చర్యలు ఉంటాయని డీజిపి ప్రకటించారు.

మరి పోలీసులు ఇస్తున్న ధమ్కి ఎంతవరకు పనిచేస్తుందో, కొణిదెల – నందమూరి ఫ్యాన్స్ ఎంతవరకు కంట్రోల్ లో ఉంటారో చూడాలి. ఇక ఖైదీ నం 150 జనవరి 11వ తేదిన, గౌతమీపుత్ర శాతకర్ణి జనవరి 12వ తేదిన విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.