జగన్ భగీరథ ప్రయత్నం! మరో జలయజ్ఞంకి సిద్ధం

ఆకాశం నుంచి గంగని భూమికి తీసుకొచ్చిన అపర భగీరథుడు వారసులుగా నేటి భారతంలో చాలా తక్కువ మంది ఉన్నారు.వృదాగా పోతున్న గోదావరి జలాలని ఒడిసిపట్టి కోస్తా జిల్లాలలో లక్షల ఎకరాలకి నీరు అందించి, ఏడాదికి రెండు పంటలు పండించుకోవడానికి కారణం అయిన సర్ ఆర్థర్ కాటన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.

 Andhra Pradesh Plans To Link Godavari River With Krishna And Penna-TeluguStop.com

దశాబ్దాల క్రితం కాటన్ ఆలోచన ఇప్పటికి తెలుగు ప్రజలు అందరూ గుర్తు పెట్టుకుంటున్నారు.అతనిని అపర భగీరథుడు అంటూ కీర్తించుకుంటున్నారు.

ఇక అతని తర్వాత ఇప్పటి వరకు నదీ జలాలని ఒడిసి పట్టి సాగు, త్రాగు నీరు అందించే ప్రయత్నం ఎవరు చేయలేదు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞం పేరుతో భగీరథ ప్రయత్నం మొదలుపెట్టారు.

గోదావరి, కృష్ణ జలాలని ఒడిసి పట్టి సాగు, త్రాగు నీటి భవిష్యత్తు అవసరాల కోసం అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నం చేసారు.ఆ ఆశ నెరవేరకుండానే వైఎస్ ఊపిరి వదిలారు.

ఇక ఇప్పుడు ఏపీలో తండ్రి ఆశయం నిలబెట్టే ప్రయత్నంలో ముఖ్యమంత్రి జగన్ మరోసారి జలయజ్ఞంకి సిద్ధం అవుతున్నారు.నదుల అనుసంధానం చేసి భవిష్యత్తు తరాల కోసం అందించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టి తెలంగాణా ప్రజలకి భవిష్యత్తులో త్రాగునీటి అవసరాలు తీర్చే ప్రయత్నం చేస్తున్నారు.ఇప్పుడు తండ్రి ఆశయం కోసం కేసీఆర్తో జత కట్టి తన పేరు కూడా చరిత్రలో నిలిచిపోయేలా జలయజ్ఞంకి సంకల్పించుకున్నట్లు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube