ఏపీ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకపక్క పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగానే మరో పక్క మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసింది ఎన్నికల సంఘం.ఈ క్రమంలో గతంలో నిలిచిపోయిన ఎన్నికల ప్రక్రియను… తిరిగి అదే తరహాలో అక్కడి నుంచి కొనసాగించడానికి ఎన్నికల సంఘం సిద్ధమవుతున్నట్లు ప్రకటన రిలీజ్ చేసింది.

 Andhra Pradesh Municipal Elections Schedule Released, Andhra Pradesh,  Municipal-TeluguStop.com

దీంతో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పూర్తి కాగా నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ నుండి మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఈసీ తాజాగా రిలీజ్ చేయడం జరిగింది.

ఈ పరిణామంతో మార్చి మూడవ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇవ్వగా.

అదేరోజు మూడు గంటల తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటన రిలీజ్ కానుంది.నగర పంచాయతీలకు మార్చి 10వ తారీఖు పోలింగ్ నిర్వహించనున్నట్లు తాజా షెడ్యూల్ లో స్పష్టం చేయడం జరిగింది.దీంతో పోలింగ్ ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతోంది.5 గంటల వరకు క్యూ లైన్ లో ఉన్న ఓటర్లు అందరికీ ఓటు హక్కు వినియోగించుకునే రీతిలో ఎన్నికల సంఘం ఏర్పాటు చేయడానికి రెడీ అవుతుంది.మార్చి 14 వ తారీకు ఉదయం ఎనిమిది గంటల నుండి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించి…మున్సిపల్ ఎన్నికల ఫలితాలను విడుదల చేయనున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా నోటిఫికేషన్ రిలీజ్ చేయడంతో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ అమలులోకి రావడం జరిగింది.

Telugu Andhra Pradesh, March, Panchayathi, Vote-Telugu Political News .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube