ఏపీలో ఇక సమరమే ! రాజకీయ యుద్దానికి సిద్దమేనా ...?

తెలంగాణాలో ఎన్నికల యుద్ధం ముగిసింది.ఆ యుద్ధం లో అన్ని రాజకీయ పార్టీలు శక్తివంచన లేకుండా పోరాడాయి.

 Andhra Pradesh Local Parties Get Ready For Election In 2019-TeluguStop.com

ఈ దశలో ఒక పార్టీ మీద మరో పార్టీ అనేక కుట్రలు… కుతంత్రాలు… ఎత్తులు… పై ఎత్తులు వేస్తూ… జనాలకు… విసుగుతో కూడిన వినోదాన్ని పంచాయి.ఫైనల్ గా అక్కడ మళ్ళీ టీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వచ్చింది.

ఇప్పుడు అక్కడ ముగిసిన యుద్ధం ఏపీలో మొదలయ్యింది.సాధారణ ఎన్నికలకు ఇంకా ఐదు నెలల సమయం మాత్రమే ఉండడంతో అన్ని రాజకీయ పార్టీలు యుద్దానికి సిద్ధం అవుతూ కత్తులు పదునుపెట్టే పనిలో మునిగిపోయాయి.

అసలు రాజకీయం అంటేనే నిత్య పోరాటం.ఇక్కడ ప్రతి నిమిషం అలెర్ట్ గా ఉండాల్సిందే.

లేకపోతే రాజకీయంగా ఎదురు దెబ్బలు తప్పవు.ఇక ఎన్నైకల సమయంలో అయితే… విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో దద్దరిల్లాల్సిందే.

ఎందుకంటే.ఎన్నికలు.

చావో రేవో అన్నట్లుగా.పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి.

ఇప్పుడు ఏపీలో రాజకీయం హోరాహోరీగా ఉండబోతోంది.ఇక్కడ ప్రధానంగా… కాంగ్రెస్ , టీడీపీ, జనసేన , వైసీపీ, బీజేపీ పార్టీలు ఉన్నా … ప్రధాన పోటీ అంతా వైసీపీ , టీడీపీ, జనసేన పార్టీల మధ్యే ఉండబోతోంది.ఏపీలో ఎవరెవరు.ఎవరెవరితో తలపడబోతున్నారో దానిపై ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది తెలంగాణలో ఎన్నికలు ముగిసిన తర్వాత ఏపీలో రాజకీయాలు చాలా వేగంగా మారిపోతున్నాయి.చంద్రబాబునాయుడు టార్గెట్ గా రాజకీయ పరిణమాలు చోటు చేసుకుంటున్నాయి.ఏపీలో ప్రధానప్రతిపక్షంగా జగన్ కన్నా.

బయట నుంచి తెలుగుదేశం పార్టీపై చేస్తున్న రాజకీయ పోరాటమే ఎక్కువగా ఉంది.ఢిల్లీ నుంచి బీజేపీ, తెలంగాణ నుంచి కేసీఆర్.

చంద్రబాబును టార్గెట్ చేశారు.ఇప్పుడు అందరి ఏకైక లక్ష్యం చంద్రబాబు నాయుడే.

అందుకే టీఆర్ఎస్ , బీజేపీ పార్టీలు కూడా అంతర్గతంగా జగన్ కు మద్దతు పలుకుతూ… టీఆర్ఎస్ పార్టీని మట్టి కరిపించేందుకు శాయశక్తులా కృషిచేస్తున్నారు.దీంతో ఒక్కసారిగా టీడీపీలో నిస్తేజం కమ్ముకుంది.

ఏపీలో టీడీపీని మరోసారి అధికారంలోకి రాకుండా … అలాగే రాజకీయంగా చంద్రబాబు ని అణగదొక్కడానికి జనసేన – వైసీపీ పార్టీల మధ్య పొత్తు కుదర్చడానికి తెరవెనుక ప్రయత్నాలు సాగుతున్నాయి.చంద్రబాబును ఓడించడానికి.అన్ని విధాలుగా టీడీపీ ప్రత్యర్థులకు బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు సహకరిస్తున్నాయి.కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే.ఇక్కడ ఒకరికొకరు అన్నివిధాలా సహకరించుంటున్నా… పైకి మాత్రం ఒక పార్టీతో మరో పార్టీ కి వైరం ఉన్నట్టే బిల్డప్ ఇస్తున్నాయి.దీనికి కారణం కూడా లేకపోలేదు.ఎందుకంటే… ఒకరితో ఒకరు కలిస్తే.రాజకీయ సమీకరణాలు మారిపోయే ప్రమాదం ఉంది.

బీజేపీతో కలిసేందుకు వైసీపీ ముందుకు రాదు.టీఆర్ఎస్ మద్దతును బహిరంగంగా తీసుకునేదుకు కూడా.

వైసీపీ ముందుకు రాకపోవచ్చు.ప్రత్యేకహోదా కోసం లేఖ రాస్తానంటూ.

కేసీఆర్ చేసిన ప్రకటనపై వైసీపీ చాలా పాజిటివ్ గా స్పందిస్తోంది.అంటే వైసీపీ టీఆర్ఎస్ పార్టీతో స్నేహం పెట్టుకున్నా… ఏపీ ప్రజల నుంచి ఎక్కడా వ్యతిరేకత అయితే రాదు అనేది వైసీపీ భావన.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube