మూడు పార్టీలు మూడు ప్రాంతాలు..ఎవరిది పై చేయి.

రాబోయే సాధారణ ఎన్నికల్లో అధికారం పీఠం ఎవరికి దక్కబోతుందో అన్న ఉత్కంఠ అందరిలోనూ ఉంది.ఏ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశం కనిపించబోతోంది అనే తెలియడం లేదు.

 Andhra Pradesh Legislative Assembly Election 2019-TeluguStop.com

దీనికి కారణం కూడా ఉంది.వచ్చే ఎన్నికల్లో ప్రధానంగా మూడు పార్టీల మధ్య ముక్కోణపు పోటీ జరగబోతోంది.

కానీ మూడు పార్టీలకు మూడు ప్రాంతాల మీద పట్టు ఉంది.

రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఒక్కో ప్రాంతంలో ఒక్కో పార్టీకి స్పష్టమైన పట్టు కనిపిస్తోంది.

రాయలసీమలోని కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలతో పాటూ నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వైసీపీకి మంచి పట్టుంది.గత ఎన్నికల్లో చంద్రబాబు గాలి బాగా వీచిన సమయంలోనూ ఈ ఐదు జిల్లాల్లోనే 41 సీట్లను వైసీపీ సాధించింది.మిగతా ఎనిమిది జిల్లాల్లో కలిపి వైసీపికి వచ్చిన సీట్లు.25 మాత్రమే.రెడ్డి సామాజిక వర్గం అత్యధికంగా ఉన్న జిల్లాలు కావడం కూడా వైసీపీకి కలిసొచ్చే అంశంగా మారింది.

ఇక టీడీపీ విషయానికి వస్తే ప్రస్తుతం కృష్ణా, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో ఆ పార్టీకి అనుకలత ఎక్కువగా ఉండే అవకాశం బాగా కనిపిస్తోంది.గత ఎన్నికల్లోనూ ఈ మూడు జిల్లాల్లో టీడీపీ హవా కొనసాగింది.గత ఎన్నికల్లో ఈ మూడు జిల్లాల్లో కలిపి 34 సీట్లను ఆ పార్టీ గెలుచుకుంది.

కమ్మ సామాజిక వర్గం పట్టున్న జిల్లాలు కావడంతో.ఈ మూడింటిలోనూ తెలుగుదేశం పార్టీకి కలిసొస్తోంది.

ఈసారి మరో ఐదారు సీట్లు ఈ మూడు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి పెరిగే అవకాశం కనిపిస్తోంది.అయితే.

గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ క్లీన్‌స్వీప్ చేసిన పశ్చిమ గోదావరి, 13 సీట్లు గెలుచుకున్న తూర్పు గోదావరిల్లో ఈసారి టీడీపీ ఎదురు ఈదడం ఖ్యంగా కనిపిస్తోంది.

గోదావరి జిల్లాల్లో టీడీపీకి జనసేన రూపంలో గండి పడబోతోంది.

జనసేన పార్టీకి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మంచి పట్టు పెరిగింది.కాపు సామాజిక వర్గం ఓట్లతో పాటూ.

మెగా అభిమానులు ఈ రెండు జిల్లాల్లో అత్యధికంగా ఉన్నారు.అందుకే.

జనసేనకు ఈ రెండు జిల్లాలు వచ్చే ఎన్నికల్లో బాగా కలిసొచ్చే అవకాశం కనిపిస్తోంది.

ఉత్తరాంధ్ర రాజకీయాల విషయానికి వస్తే… విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం.ఈ మూడు జిల్లాల్లో మాత్రం ఓటర్ల నాడి ఇంకా స్పష్టంగా తెలియడం లేదు.ఎవరికి కొమ్ముకాస్తారనేది ఇంకొంత కాలం ఆగితే కాని తెలియదు.

గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఈ మూడు జిల్లాల్లో పట్టం కట్టారు.మూడు జిల్లాల్లోని 34 సీట్లలో తెలుగుదేశం పార్టీకి 24 వచ్చాయి.

మిగతా పదిలో 9 వైసీపీకి, ఒకటి బీజేపీకి వచ్చాయి.ఈసారి పవన్ కళ్యాణ్ రాకతో.

ఉత్తరాంధ్రలో ఎవరికీ స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశం కనిపించడంలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube