నక్సల్స్ టార్గెట్ పై నేతల్లో వణుకు ! ఆ లిస్ట్ లో పేర్లు ఇవే !  

Andhra Pradesh Leaders On Maoist Hit-list-

ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఏపీలో కొద్ది రోజుల క్రితం నక్షలైట్లు మెరుపు దాడి చేసి ఒక ఎమ్యెల్యే, ఒక మాజీ ఎమ్యెల్యేను మట్టుబెట్టడం సంచలనం సృష్టించింది.అసలు చాలాకాలంగా నక్సల్స్ కార్యకలాపాలు ఏపీలో పెద్దగా లేవనే చెప్పాలి.ఏపీలో వారి ఉనికి కనుమరుగు అవుతుందనుకుంటున్న సమయంలో వారు ఈ ఘాతుకానికి పాల్పడడం అందరిని షాక్ కి గురిచేసింది..

Andhra Pradesh Leaders On Maoist Hit-list--Andhra Pradesh Leaders On Maoist Hit-list-

అయితే ఈ వ్యవహారం ఇక్కడితో అయిపోలేదు.తదుపరి దాడి చేసేందుకు నక్సల్స్ కాసుకొని కూర్చున్నారు.దీనికోసం తాము టార్గెట్ చేసుకున్న ప్రజాప్రతినిధులకు సంబంధించి పెద్ద లిస్ట్ తయారు చేసుకున్నట్టు పోలీసులు బయటపెట్టడంతో నాయకుల్లో వణుకు మొదలయ్యింది.

ప్రజా ప్రతినిధులు, మాజీలు, వివిధ పార్టీల నాయకులు, పోలీసులు, మిలీషియాలో పని చేసి లొంగిపోయిన యువకులు, పోలీసు ఇన్‌ఫార్మర్లుగా భావిస్తున్న గిరిజనులు… ఇలా మొత్తం 200 మందితో మావోయిస్టులు హిట్‌లిస్ట్‌ తయారు చేసుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.ఈ నేపథ్యంలో తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా బయటకు వెళ్లొద్దంటూ కొంతమంది మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలను పోలీసులు హెచ్చరించినట్టు తెలిసింది.మావోయిస్టుల హిట్‌లి్‌స్టలో విశాఖ జిల్లాకు చెందిన మంత్రి అయ్యన్నపాత్రుడు, పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఉన్నట్లు సమాచారం.అందుకే వారికి ప్రభుత్వం భారీగా భద్రత పెంచినట్టు తెలుస్తోంది.

నక్సల్స్ టార్గెట్ లో ఉన్న నేతలు వీరే !

అయ్యన్న సోదరుడు సన్యాసి పాత్రుడు, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, ఆయన సోదరుడు వినాయక్‌, గిడ్డి ఈశ్వరి వ్యక్తిగత కార్యదర్శి పోలుపర్తి గోవిందరావు, బీజేపీ నాయకుడు లోకుల గాంధీ, కొయ్యూరు మండలం బూదరాళ్ల మాజీ సర్పంచ్‌ సూరిబాబు, ఇదే మండలానికి చెందిన టీడీపీ నాయకుడు ఎం.ప్రసాద్‌, పెదబయలు మండలాధ్యక్షుడు ఉమామహేశ్వరరావు, మాజీ ఎంపీపీ జర్సింగి సూర్యనారాయణ, పెదబయలు మండలం జామిగూడ మాజీ సర్పంచ్‌ సుబ్బారావు,

ఇంజిరి మాజీ సర్పంచులు సత్యారావు, కామేశ్వరరావులకు మావోయిస్టుల నుంచి ముప్పు పొంచి ఉన్నట్లు అనుమానిస్తున్నారు.చింతపల్లి మండలంలో 12 మందిని, జీకే వీధి మండలంలో ఎనిమిది మందిని లక్ష్యంగా చేసుకొని ఇప్పటికే అనేక పర్యాయాలు హెచ్చరికలు జారీ చేసినట్టు సమాచారం.ఇంకా ఏజన్సీలోని పలు మండలాలకు చెందిన 110 మంది ఈ జాబితాలో ఉన్నట్టు సమాచారం.