రాబోయే భారత రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా ఈ ఏడాది ప్రదర్శించనున్న భారీ కలంకారీ తెరలపై మన తెలుగు కళాకారుడి చిత్రాలు ప్రదర్శించునున్నారు.ఇది నిజంగా ప్రతి తెలుగు పౌరుడు గర్వించదగ్గ విషయం అనే చెప్పాలి.
భారతదేశ వైవిధ్యాన్ని చాటిచెప్పే జానపద కళా రూపాలతో పాటు వివిధ కళారుపాలను కూడా ఈ వేడుకల్లో ప్రదర్శించునున్నారు.పంజాబ్ లోని రాజ్‌పురా చిట్కారా విశ్వవిద్యాలయంలోని కళాకుంభ్ లో తయారైన భారీ తెరలను గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రదర్శించనున్నారు.
రాజ్‌పథ్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓపెన్ గ్యాలరీలో ఏకంగా750 మీటర్ల పొడవున్న భారీ తెరలపైన దాదాపు 500 మందికి పైగా కళాకారులు రూపొందించిన అనేక కళారూపాలను చిత్రించడం జరిగింది.
అయితే ఈ ప్రదర్శనకు ఎంపిక చేసిన ప్రతిష్టాత్మక కళారూపాల జాబితాలో కలంకారీ కళారూపం కూడా ఉండడం విశేషం అనే చెప్పాలి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన కళాకారుడు సుధీర్ రూపొందించిన కలంకారీ కళ కూడా ఈ భారీ తెరపై ప్రదర్శించబడడం విశేషం అనే చెప్పాలి.అసలు కలంకారీ కళ అంటే ఏంటో ఒకసారి తెలుసుకుందామా.
కలంకారీ కళ అనేది సహజమైన రంగులను ఉపయోగించి, చింతపండు పెన్నుతో కాటన్ లేదా సిల్క్ వస్త్రంపై వేసే చేతి పెయింటింగ్ అన్నమాట.నిజానికి ‘కలం’ అంటే కుంచె అని అర్ధం.
అలాగే ‘కరి’ అనే పదం కళాత్మకతను తెలుపుతుంది అని చరిత్రకారులు చెబుతున్నారు.

అలాగే కలంకారి కళలో డైయింగ్, బ్లీచింగ్, హ్యాండ్ పెయింటింగ్, బ్లాక్ ప్రింటింగ్, క్లీనింగ్ ఇంకా శ్రమతో కూడిన 23 దశలు ఉంటాయి.అంత తెలికైనా కళ ఏమి కాదు.కలంకారీలో గీసిన మోటిఫ్ లు పువ్వులు, నెమలి, పైస్లీలు మొదలు మహాభారతం, రామాయణం వంటి హిందూ ఇతిహాసాల కధలను కూడా చిత్రికరిస్తారు.
ఈ రోజుల్లో ఈ కలంకారి కళను ప్రధానంగా కలంకారీ చీరల తయారీకి ఉపయోగిస్తున్నారు.శ్రీ కాళహస్తి పట్టణంకు చెందిన సుధీర్ అనే కళాకారుడు ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకున్నరు.
హంపిలోని కన్నడ విశ్వవిద్యాలయం నుంచి పెయింటింగ్‌లో బ్యాచిలర్ ఇన్ విజువల్ ఆర్ట్స్ కూడా చేసాడు.అలాంటి సుధీర్ ఈ గణతంత్ర వేడుకల్లో తన కలంకారి కళను ప్రదర్శించి అందరిని ఆకట్టుకొన్నారు మన తెలుగు కళాకారుడు.