రఘురామకృష్ణంరాజు కి హైకోర్టులో చుక్కెదురు..!!

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేయటం తెలిసిందే.ఉద్దేశపూర్వకంగా కులాల మధ్య మరియు మతాల మధ్య వివాదాలు సృష్టించే విధంగా కొన్ని మీడియా ఛానల్స్ తో చేతులు కలిపి ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఏపీ సీఐడీ కేసు నమోదు చేయడం జరిగింది.

 Andhra Pradesh High Court Raghurama Krishnam Raju Bail Rejected-TeluguStop.com

శుక్రవారం హైదరాబాదులో ఆయన నివాసంలో రఘురామకృష్ణంరాజు ని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో.బెయిల్ కోసం రఘురామకృష్ణంరాజు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేశారు.

ఈ నేపథ్యంలో విచారణ జరపగా .హైకోర్టు చివరాకరికి రఘురామకృష్ణంరాజు బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ చేయడం జరిగింది.

 Andhra Pradesh High Court Raghurama Krishnam Raju Bail Rejected-రఘురామకృష్ణంరాజు కి హైకోర్టులో చుక్కెదురు..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

విచారణ ప్రారంభం అయిన వెంటనే.నేరుగా హైకోర్టులో రావటం ఏంటి.? సిఐడి జిల్లా కోర్టులో తేల్చుకోవాలి కదా అని న్యాయస్థానం పేర్కొంది.ఎంపీ హోదాలో ఉన్న వ్యక్తిని అరెస్టు చేశారని రఘురామకష్ణంరాజు తరపు న్యాయవాదులు న్యాయస్థానంలో వాదనలు వినిపించారు.

ఈ క్రమంలో ప్రభుత్వం తరఫున న్యాయవాదులు ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ.సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే తరహాలో పాల్పడ్డారని.వాదనలు వినిపించారు.దీంతో వెంటనే హైకోర్టు వైసీపీ రెబల్ ఎంపీ బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేయడం జరిగింది.

ఈ కేసులో జోక్యం చేసుకోలేమని .బెయిల్ కావాలంటే సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని సూచించింది. రఘురామ కృష్ణంరాజు తరపు న్యాయవాదులు సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయడానికి ఏర్పాటు చేస్తున్నారు.

#RaghuramKrishna #Ap Cid Police #AP High Court #Ysrcp #Ycp Rebel Mp

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు