ఆ విధంగా ఇన్ఫర్మేషన్ లాగేస్తున్న 'బెట్టింగ్ రాయుళ్లు'  

Andhra Pradesh Heavy Betting On Election Results-heavy Betting,master Plans,ycp And Tdp,బెట్టింగ్ రాయుళ్

సందట్లో సడేమియా అన్నట్టు ఎవరిపనిలో వారు నిమగ్నమై ఉన్నారు. ఒక పక్క 23 వ తేదీన తమ జాతకం ఎలా ఉండబోతుందో అన్న ఆందోళనలో పార్టీలు, అభ్యర్థులు టెన్షన్ టెన్షన్ గా ఉన్నారు. ఇదే సమయంలో బెట్టింగ్ రాయుళ్లు మాత్రం పందేలతో పల్లె నుంచి పట్నం వరకు హడావుడి చేసేస్తున్నారు. బెట్టింగ్ రాయుళ్ల పందెమంతా సర్వేలను నమ్ముకునే జరుగుతుంటాయి..

ఆ విధంగా ఇన్ఫర్మేషన్ లాగేస్తున్న 'బెట్టింగ్ రాయుళ్లు'-Andhra Pradesh Heavy Betting On Election Results

అయితే ఇప్పుడు ఆ సర్వేలు కూడా రకరకాల రిజల్ట్స్ ప్రకటిస్తుండడంతో వారు కూడా ట్రెండ్ మార్చారు. అసలు ఏపీలో ఏ పార్టీ గెలవబోతోంది ? ఏ ఏ నియోజకవర్గం లో ఏ అభ్యర్థికి గెలుపు ఛాన్స్ ఉంది అనే అంశాలను గురించి తమకున్న అన్ని సోర్స్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

అసలు ఏపీలో ఎన్నికలు ముగిసిన వెంటనే ఎక్కువమంది బెట్టింగులు కాసారు.

ఇప్పుడు ఫలితాల ప్రకటన మరి కొద్ది రోజుల్లో వెలువడుతుండడంతో మరోసారి బెట్టింగ్ రాయుళ్లు పొలిటికల్ పందాలకు రెడీ అవుతున్నారు. నగరాలు, పట్టణాల్లోనే కాదు. పల్లెల్లో కూడా జోరుగా పందాలు కాస్తూ పొలిటికల్ హీట్ పెంచే పనిలో పడ్డారు.

అయితే బెట్టింగ్ రాయుళ్లు ఈసారి ఆషామాషీగా పందేలు కాయడంలేదు. ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే దానిపై క్రాస్ చెక్ చేసుకుంటున్నారు. దీనిలో భాగంగా రాజకీయ పార్టీల వెంట తిరిగే వారిని బెట్టింగ్ రాయుళ్లు సంప్రదించి ఫలితాల పై ఒక అంచనాకు వస్తున్నారు.

కేవలం వారొక్కరితో సరిపెట్టలేదు. మీడియాలో పనిచేసే వారికి కూడా ఫోన్లు చేసి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ‘ఏ పార్టీకి అనుకూలంగా ఉంది? ఏమైనా సర్వేలు చేశారా? ఏ పార్టీపై బెట్టింగ్ కాస్తే బెటర్ అంటూ అనేకవిధాలుగా వారి నుంచి ఇన్ఫర్మేషన్ లాగుతున్నారు. మరీ ముఖ్యంగా ఎన్నికల విధులకు హాజరైన వారిని కూడా అనేక ప్రశ్నలు అడుగుతూ పోలింగ్ సరళిని అంచనా వేస్తున్నారు.

బెట్టింగ్ ల ద్వారా వందల కోట్లు చేతులు మారుతున్నా ఈ వ్యవహారానికి ఎక్కడా అడ్డుకట్ట అయితే పడడంలేదు.