ఇక నుంచి 11 దాటిన తర్వాత బయటికొస్తే తుక్కు రేగ్గొట్టడమే...

ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కఠోరంగా శ్రమిస్తున్నారు.అంతేగాక ఇప్పటికే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు రాష్ట్రంలో అత్యవసర సర్వీసులు తప్ప మిగిలిన అన్ని సదుపాయాలను మూసివేశారు.

 Andhra Pradesh Government, Corona Virus News, Andhra Pradesh Corona Virus News,-TeluguStop.com

అలాగే 21రోజుల పాటు ప్రజలను అత్యవసర పరిస్థితుల్లో తప్ప మరే ఇతర సమయాల్లోనూ బయటికి రాకూడదంటూ ఎక్కడిక్కడే స్తంభింపజేశారు.

అయినప్పటికీ ప్రజలు ప్రభుత్వ ఆదేశాలలో అనుకరించకుండా ఏదో వంకతో రోడ్ల పైకి వస్తున్నారు.

దీనివల్ల కరోనా వైరస్ ఒక చోట నుండి మరో చోటికి సులభంగా వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో ఇవాళ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి ఆళ్ళ నాని ఇక నుంచి ఉదయం 11 గంటల తర్వాత ఎవరైనా బయట సంచరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆదేశాలు జారీ చేశారు.

అంతేగాక నిత్యావసర సరుకుల కోసం ఇంతకు మునుపు మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజలను బయటకి అనుమతించే వాళ్లమని కానీ ఇప్పుడు పరిస్థితులు మరింత తీవ్రంగా మారుతుండటంతో ఈ సమయాన్ని 11 గంటల వరకూ మాత్రమే కుదించామని తెలిపారు.

అలాగే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా నిత్యావసర సరుకులు కానీ లేదా కూరగాయలు గాని, ఇలా ఏదైనా వస్తువులు సరే ఎమ్మార్పీ ధరలు కంటే ఎక్కువ ధరలకే అమ్మితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిచారు.

అలాగే ఇందుకు సంబంధించినటువంటి ఓ కాల్ సెంటర్ ని కూడా ఏర్పాటు చేస్తామని, ప్రజలు కూడా ఎవరైనా వస్తువులను ఎక్కువ ధరలకు అమ్మితే తమకు నిరభ్యంతరంగా సమాచారం అందించవచ్చని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube