మద్యం ప్రియులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌

ఏపీ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీలో భాగంగా కొన్నాళ్ల క్రితం భారీగా రేట్లను పెంచిన విషయం తెల్సిందే.ప్రభుత్వం ఈ విషయంలో నిరుపేదలను దోచుకుంటుంది అంటూ విమర్శలు వస్తున్నాయి.

 Andhra Pradesh Government Decision To Reduce Alcohol Prices, Ys Jagan, Ap Govt,-TeluguStop.com

కరోనా లాక్‌ డౌన్‌ తర్వాత విపరీతంగా పెంచిన మద్యం రేట్లను మళ్లీ తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఇందులో భాగంగా ప్రభుత్వం 150 రూపాయల కంటే తక్కువ ఉన్న మద్యం బ్రాండ్ల రేట్లను తగ్గిస్తున్నట్లుగా ప్రకటించింది.

లిక్కర్‌ రేటు క్రమబద్దీకరించి జీవోను జారీ చేసింది.మంత్రి వర్గ భేటీలో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.బీర్లు మరియు రెడీ టు డ్రింక్‌ ధరలు కూడా తగ్గించినట్లుగా పేర్కొన్నారు.గత కొన్ని రోజులుగా ఏపీ ప్రభుత్వం మద్యం విధానంపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

రాబోయే అయిదు ఏళ్లలో పూర్తిగా వైన్‌ షాప్స్‌ ను తొలగిస్తామంటూ సీఎం జగన్‌ గతంలో పేర్కొన్న విషయం తెల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube