ఏపీలో థియేటర్ల ఓపెన్‌ కు ఇంకాస్త సమయం పట్టవచ్చు

దేశ వ్యాప్తంగా కరోనా వల్ల కేంద్రం లాక్‌ డౌన్‌ ను విధించిన విషయం తెలిసిందే.మార్చిలో విధించిన కరోనా లాక్డౌన్ ఇంకా కొన్ని ఏరియాల్లో కొన్నింటిపై కొనసాగుతూనే ఉన్నాయి.

 Andhra Pradesh Government Ok To Open Theaters Ap, Theaters, Octomber 15th, Kcr,-TeluguStop.com

థియేటర్ లపై గత ఏడు నెలలుగా ఆంక్షలు కొనసాగుతున్నాయి.థియేటర్లు మూత పడటంతో ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ లేక ఉసూరుమంటున్నారు.

అలాగే యాజమాన్యాలు కూడా ఆర్థికంగా చాలా నష్టపోతున్నామని అంటూ వేడుకున్నారు.దాంతో కరోనా నివారణ చర్యలు పాటిస్తూ ఓపెన్ చేసుకోవచ్చు అంటూ కేంద్ర ప్రభుత్వం ఇటీవలే మార్గ దర్శకాలను విడుదల చేసింది.

తప్పని సరిగా థియేటర్లలో కరోనా నివారణ చర్యలు చేపట్టాల్సిందిగా సూచించింది.అక్టోబర్ 15 నుండి థియేటర్లు ఓపెన్ అన్ని విధాలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఏపీలో కేసులు ఎక్కువగా ఉన్న కారణంగా థియేటర్లు ఓపెన్ అయ్యే అవకాశం ఉందా లేదా అంటూ చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు.అయితే ప్రభుత్వం నుంచి ఆ విషయమై స్పష్టత వచ్చింది థియేటర్ లో ఓపెన్ కి ఎలాంటి అభ్యంతరం లేదంటూ అధికారికంగా నోటీసులను విడుదల చేయడం జరిగింది.

ఆ నోటీసులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్‌ లైన్స్‌ ను పాటించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా విధించిన కండీషన్స్‌ ను పాటిస్తూ థియేటర్లను ఓపెన్ చేసుకోవాలంటూ థియేటర్ల యాజమాన్యాలు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.తెలంగాణలో థియేటర్ ఓపెన్ అవుతాయా లేదా అనే విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

సీఎం కేసీఆర్ జరగబోయే మీటింగ్ లో ఈ విషయమై అధికారిక నిర్ణయం తీసుకోనున్నారు.తెలంగాణలో కేసులో నామ మాత్రంగానే ఉండటం వల్ల థియేటర్ల ఓపెన్ కి అనుకూలంగా నిర్ణయం వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల వారు భావిస్తున్నారు.

అక్టోబర్‌ 15 నుండి థియేటర్లు ఓపెన్‌ కు రంగం సిద్దం అవుతుంది.కాని విడుదలకు కొత్త సినిమాలు ఏమీ లేవు.ఆ కారణంగా పాత సినిమాలనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube