బాలయ్య డైలాగులు చెప్తూ... అడ్డంగా బుక్కయిన ప్రభుత్వ విప్  

ఏపీలో జరగబోయే ఎన్నికల్లో ఎలాగైనా గట్టెక్కాలనే ఉద్దేశంతో… అధికార పార్టీ టీడీపీ ఆపసోపాలు పడుతోంది. అనేక అనేక సంక్షేమ పధకాలు ప్రకటిస్తూ… ప్రజల్లో మద్దతు పొందేందుకు ప్రయత్నిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఎంతయితే స్పీడ్ గా ప్రజల్లోకి వెళ్లాలని చూస్తున్నారో అంతే స్పీడ్ గా ఆ పార్టీ నాయకులు, ఎమ్యెల్యేలు తమ చేష్టలతో ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకు వస్తున్నారు. మొన్న పశ్చిమ గోదావరి జిల్లా … నర్సాపురం ఎమ్యెల్యే బండారు మాధవ నాయుడు ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్యెల్యే, ప్రభుత్వ విప్ కూన రవికుమార్ ఓ వ్యక్తిని ఫోన్ లో బెదిరిస్తూ అడ్డంగా దొరికిపోయారు. అవికాస్తా ఇప్పుడు వైరల్ గా మారడంతో టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారింది.

Andhra Pradesh Government Officer Booked For Balakrishna Dialogues-Balakrishna Dialogues Chandrababu Naidu Goernament Veep Viral In Social Media

Andhra Pradesh Government Officer Booked For Balakrishna Dialogues

దీనికి సంబందించి పూర్తి వివరాలు తెలుసుకుంటే… శ్రీకాకుళం జిల్లా కు చెందిన గంగిరెడ్ల శివ అనే వ్యక్తి ఇటీవల టీడీపీ లో ఇమడలేక బయటకి వచ్చేసాడు. ఆ విషయం కాస్తా… ప్రభుత్వ విప్ కూనా రవికుమార్ కి తెలియడంతో… ఆ వ్యక్తికి ఫోన్ చేసి మరీ వార్నింగ్ ఇచ్చేసాడు. అయితే తనకు కొన్ని ఇబ్బందులు ఎదురవడం వల్లే బయటకు వచ్చానని శివ చెప్పగా…. ఏంట్రా నీ ఇబ్బందులు అంటూ నోటికొచ్చినట్టు తిట్లపురాణం అందుకున్నారట. ఆ సంభాషణ యధాతధంగా….

Andhra Pradesh Government Officer Booked For Balakrishna Dialogues-Balakrishna Dialogues Chandrababu Naidu Goernament Veep Viral In Social Media

విప్ కూన రవికుమార్‌: వినమ్మా ఇవన్నీ నాకు అనవసరం. నాలో ఒక యాంగిల్ చూశావు, రెండో యాంగిల్‌ కూడా నువ్వు చూడాలనుకుంటే, నేను చెయ్యాలనుకుంటే.. ఏం చేస్తానన్నది నువ్వు చూద్దువు గానీ.

శివ: ఇక్కడున్న డిస్టబెన్స్‌ వల్ల నేను బయటకు వెళ్లాను సార్‌.

విప్‌: ఈ రోజు డిస్టబెన్స్‌ ఏంటిరా, ఎవడ్రా డిస్టబెన్స్‌ మీకు పనిచేసినప్పుడు డిస్టబెన్స్‌ లేదు.

శివ: మీ కార్యకర్తలు నన్ను అవాయిడ్‌ చేశారు. నేను మొదటి నుంచి వారితోనే తిరిగాను.

విప్‌: కార్యకర్తలు ఎవాయిడ్‌ చేయటమేంటి, తమాషా దె*****వా .. వెధవ మాటలు మాట్లాడవద్దు. మీ కార్యకర్త అంటావేంటి తమాషాగా మాట్లాడుతున్నావా నువ్వు. ఏ కార్యకర్త అనుకుని బీసీ కార్పొరేషన్‌ లోన్‌ నీకు ఇచ్చాను. తమాషా చేస్తున్నావేమి, వెధవ మాటలు మాట్లాడి నువ్వేదో పెద్ద పోటుగాడిలా మాట్లాడకు.

శివ: అలా అంటే నేనేమీ చెప్పలేను సార్‌.

విప్‌: నువ్వు మళ్లీ ఎక్కడైనా ఈ రోజు లగాయతు కనిపించినా కాన్సిక్వెన్సీస్‌ చాలా సీరియస్‌గా ఉంటాయి. ఆ తర్వాత మీ అమ్మ కాదు, మీ మేనమామ కాదు ఎవ్వడొచ్చినా సరే, నేను మనిషిని పట్టించుకోనంత వరకే, పట్టించుకొన్నానంటే ఎక్కడకు పాతేస్తానో నాకు తెలుసు, ఫస్ట్‌ అండ్‌ ఫైనల్‌ వార్నింగ్‌. నీకు చేతనైతే నీకు విశ్వాసముంటే నీవు మనిషివైతే తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని తిరుగు. లేదంటావు ఆ తర్వాత నియోజకవర్గంలో ఏం చేయాలో అది చేస్తా. నువ్వు తిరగబడితే మాత్రం పాతాళానికి తొక్కేస్తాను.

శివ: నేను మీకు వ్యతిరేకంగా వెళ్లలేదు. నేనైతే..

విప్‌: వినయ్యా నువ్వు ఇవన్నీ నాకు చెప్తావేంటి. మీరేం చేస్తారో ప్రతి అంగులం నాకు తెలుసు. నేనేం చూడటం లేదు అనుకుంటున్నారు. ఈ రోజు వరకు డెవలప్‌మెంట్‌పై దృష్టి పెట్టాను. ఈ రోజు లగాయితు రాజకీయం మళ్లీ చేస్తాను. ఇదీ వెరీ క్లియర్‌. చెబుతున్నాను. నువ్వు నీ ఆలోచన మార్చుకో, నీ టెండెన్సీ మార్చుకో, నీ నడక మార్చుకో, మార్చుకోకపోతే కాన్సిక్వెన్సీస్‌ భవిష్యత్‌లో చాలా సీరియస్‌గా ఉంటాయి.

విప్‌: ఎవడా వచ్చిన నాకొడుకు, ఎవడా వచ్చినోడు?.

శివ: కాంట్రాక్టర్లు ఎవరో వచ్చి కట్టుకెళ్లారంటే నాకు తెలియదు సార్‌.

విప్‌: రేయ్ విను. సీతారామే కాదు.. నీన్నెవ్వడూ కాపాడడు గుర్తు పెట్టుకో. వాడిదే దె****. నీకు చేతనైతే తెలుగు దేశం పార్టీ జెండా పట్టుకుని తిరుగూ. లేదనంటావా కాన్సీక్వెన్సెస్‌ చాలా సీరియస్‌గా ఉంటాయి. వెంటాడి వెంటాడి వేటాడుతాను. గుర్తు పెట్టుకోండి రైట్‌.