జగన్ మరీ ఇంతగా మారిపోయాడా ?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనే నేను అంటూ జగన్ ప్రమాణ శ్రీకారం తంతు కాస్తా ముగిసింది.జగన్ ఎప్పటి నుంచో కలలు కంటున్న సీఎం పీఠం ఆయనకు దక్కేసింది.

 Andhra Pradesh Cm Ys Jagan Mohan Reddy Oath Is Completed And His Change The Att-TeluguStop.com

ఇక మిగిలింది అంతా పరిపాలన మీదే దృష్టిపెట్టారు.అయితే ఈ సందర్భంగా జగన్ వ్యక్తిత్వం గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

జగన్ అహంభావి అని, తాను చెప్పిందే అందరూ వినాలి తప్ప నేను ఎవరి మాటా వినేది లేదని జగన్ భావిస్తుంటాడని ఆయన మీద ఒక అపవాదు ఉంది.అయితే అదంతా ఒకప్పుడు.

ఇప్పుడు జగన్ పూర్తిగా మారిపోయారు.పగ, ప్రతీకారం, అహంభావం ఇవన్నీ విడిచిపెట్టి ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే నాయకుడు అనే విధంగా వ్యవహరిస్తున్నాడు.

తన రాజకీయ ప్రత్యర్థులైన చంద్ర‌బాబు స‌హా త‌న‌కు ఎవ‌రిపైనా వ్య‌క్తిగ‌త కోపం లేదంటూ జ‌గ‌న్ ప‌దేప‌దే చెబుతున్నారు.కాంగ్రెస్ పార్టీని మీద కూడా ఇదే అభిప్రాయమన్నారు.

రాజ‌కీయ విభేదాలను ప‌క్క‌న‌బెట్టి మ‌రీ వివిధ పార్టీల నేత‌ల‌ను ఆయ‌న త‌న ప్ర‌మాణ‌స్వీకారానికి ఆహ్వానించారు.ఇప్ప‌టికే ప్ర‌ధాన‌ మంత్రి న‌రేంద్ర మోదీని కలుసుకున్నారు.

జ‌గ‌న్ కూడా ప్ర‌మాణ‌ స్వీకారానికి ప్రధానిని ఆహ్వానించినా ఆయ‌న ప్ర‌మాణ‌స్వీకారం కూడా ఉండ‌టంతో హాజరుకాలేదు.ఇక‌, న‌రేంద్ర మోదీతోనూ జ‌గ‌న్ సానుకూల ధోర‌ణితో వెళ్లాల‌ని, బీజేపీతో స్నేహంగా ఉంటూ రాష్ట్రానికి రావాల్సిన అన్నిరకాల ప్రయోజనాలను పొందాలని జగన్ భావిస్తున్నాడు.

అలాగే తెలంగాణ రాష్ట్రం విషయంలోనూ ఇదే వైకిరి అవలంబించాలని భావిస్తున్నాడు.

-Telugu Political News

ఎన్నిక‌ల ముందు చేసుకున్న విమ‌ర్శ‌లను ప‌ట్టించుకోకుండా ఆయ‌న ప్ర‌మాణ‌స్వీకార కార్య‌క్ర‌మానికి అంద‌రు నేత‌ల‌కూ ఆహ్వానాలు పంపుతున్నారు.ముఖ్యంగా మొన్న‌టి వ‌ర‌కు చంద్ర‌బాబుతో ఢీ అంటే ఢీ అనేలా సాగిన జ‌గ‌న్ ఇప్పుడు నేరుగా ఫోన్ చేసి ప్ర‌మాణ‌స్వీకారానికి రావాల‌ని ఆహ్వానించారు.అయితే, చంద్ర‌బాబు వెళ్ల‌కుండా పార్టీ త‌ర‌పున ప్ర‌తినిధుల‌ను పంపాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.

ఇక‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో ఒకానొక స‌మ‌యంలో చేసుకున్న వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌ను సైతం ప‌క్క‌న‌పెట్టి ఇప్పుడు జ‌గ‌న్ స్వ‌యంగా ఆయ‌న‌కు ఫోన్ చేసి ప్ర‌మాణ‌స్వీకారానికి ఆహ్వానించారు.ఆయ‌న‌తో పాటు రాష్ట్రంలోని అన్ని పార్టీల నేత‌ల‌కు జ‌గ‌న్ ఫోన్లు చేసి మ‌రీ ఆహ్వానించారు.

ఇక‌, ఎన్నిక‌ల సమయంలో చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తు ఇచ్చిన డీఎంకే చీఫ్ స్టాలిన్ ను సైతం జ‌గ‌న్ ఆహ్వానించారు.ప‌క్క రాష్ట్రంలో కీల‌క నేత కావ‌డంతో ఆయ‌న‌తోనూ మంచి సంబంధాలు ఉండాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు.

మొత్తంగా చూస్తే జగన్ పూర్తిగా తన మీద ఉన్న వ్యతిరేక ముద్రను చెరిపేసేందుకు ప్రయత్నిస్తున్నాడని అర్ధం అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube