వ్యాక్సినేషన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీ సీఎం జగన్..!!

కరోనా సెకండ్ వేవ్ తీవ్రతకు వ్యాక్సిన్ డిమాండ్ పెరిగిపోయింది.దీంతో దేశంలో చాలా రాష్ట్రాలలో వ్యాక్సిన్ కొరత ఏర్పడింది.

 Andhra Pradesh Cm Jagan Sensational Comments On Corona Vaccination-TeluguStop.com

పరిస్థితి ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కరోనా సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ .ప్రతి ఒక్కరికి సకాలంలో బెడ్ అందేలా ఏర్పాట్లు ఉండాలని తెలిపారు.104 పనితనం మెరుగుపడేలా ఇంకా అనేక నిర్ణయాలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.అదే విధంగా  ప్రతి హాస్పిటల్ లో  “ఆరోగ్య మిత్ర” అందుబాటులో ఉండాలని అన్నారు.ఇదే టైంలో వ్యాక్సినేషన్ అంశంపై.కూడా చర్చించడం జరిగింది.

ఈ క్రమంలో రాష్ట్రంలో వ్యాక్సినేషన్ విషయంలో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలను ఖండించారు.

 Andhra Pradesh Cm Jagan Sensational Comments On Corona Vaccination-వ్యాక్సినేషన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీ సీఎం జగన్..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వ్యాక్సినేషన్ అనేది కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.కేంద్రం నిర్ణయించిన కోటా మేరకే రాష్ట్రంలో వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుందని.

ఇదంతా తెలిసి కూడా రావాలని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని పరోక్షంగా ప్రతిపక్షాలపై జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.వ్యాక్సిన్ కొనుగోలు విషయంలో గ్లోబల్ టెండర్లు కు వెళ్లాలని అధికారులకు సూచించారు.ఇక వ్యాక్సిన్ కేంద్రాల వద్ద రెడ్డి అనేది ఉండకూడదని.45 సంవత్సరాలు వయసు దాటిన ప్రతి ఒక్కరికి రెండో డోస్ అందేలా చూడాలని తెలిపారు.కరోనా చికిత్స విషయంలో బ్లాక్ మార్కెట్ అరికట్టాలని కూడా సూచించారు.రాష్ట్రంలో కరోనా కి సంబంధించే నియమించిన టాస్క్ ఫోర్స్ మరియు ప్రత్యేక అధికారులతో సమావేశమైన సీఎం జగన్ ఈ రీతిగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

#YS Jagan #Andhra Pradesh #Corona Vaccine #COVID-19 #GlobalTender

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు