జగన్ పై యుద్ధమే ? రంగంలోకి ఆర్ఎస్ఎస్

ఏపీలో బలపడేందుకు బిజెపి రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది.మొదటగా తెలుగుదేశాన్ని నామరూపాలు లేకుండా చేసి ఆ స్థానాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నాలు చేస్తూ వచ్చింది.

 Andhra Pradesh Bjp Grabing Rss For Ys Jagan Government-TeluguStop.com

ఆ పార్టీలోని కొంతమంది కీలక నాయకులను తమ పార్టీలో చేర్చుకుని టీడీపీకి షాక్ ఇచ్చింది.ఇక టీడీపీని ఇబ్బంది పెట్టే క్రమంలో వైసీపీకి సహాయ సహకారాలు అందించింది.

కానీ ప్రస్తుతం బిజెపి తన స్టాండ్ మార్చుకుని వైసిపి మీద కొద్దికాలంగా విమర్శలు చేస్తూ వస్తోంది.అయితే వైసిపి విషయంలో బిజెపి ఒక స్పష్టమైన క్లారిటీకి రాకపోవడంతో బిజెపి ఏపీ నేతలు రెండు వర్గాలుగా చీలిపోయారు.

ఒకరు జగన్ కు అనుకూలంగా సమర్థిస్తూ మాట్లాడుతుంటే, మరో వర్గం తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చేలా వైసీపీ విమర్శలు చేస్తూ వస్తోంది.ఈ పరిస్థితుల్లో ఏపీ రాజకీయాలపై ఆర్ఎస్ఎస్ నాయకులు ప్రధానంగా దృష్టిసారించారు.

Telugu Amaravathi, Ap, Chandrababu, Narendra Modi, Ys Jagan, Ysrcp-Telugu Politi

తాజాగా గుంటూరులో బిజెపి నాయకులతో ఆర్ఎస్ఎస్ నాయకులు సమావేశం నిర్వహించారు.జగన్ ప్రభుత్వం పాస్టర్లకు నెలకు 5000 ఇస్తాను అనడంపై చర్చ నిర్వహించారు.మత మార్పిడుల కోసమే వైసీపీ ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తోందని ఆర్ఎస్ఎస్ నాయకులు అభిప్రాయపడ్డారు.ఒక నిర్దిష్టమైన ప్రణాళిక, వ్యూహం లేకుండా ముందుకు వెళుతూ రాష్ట్రాన్ని వైసిపి అధోగతి పాలు చేస్తోందని, ఇసుక విధానంలో కూడా సరైన ప్రణాళిక లేకుండా దినసరి కూలీలు ఇబ్బంది పెడుతోందని చర్చించారు.

అదీ కాకుండా బిజెపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్న నాయకులను భయపెట్టేలా వారిపై ప్రభుత్వం అక్రమ కేసులు, పాత కేసులు తెరపైకి తెచ్చి రకరకాలుగా వేధిస్తున్నారని బిజెపి నేతలు కొంతమంది ఆర్ఎస్ఎస్ నాయకులకు ఫిర్యాదు చేశారు.ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే గత టిడిపి ప్రభుత్వంలో నెలకొన్న అరాచక పరిస్థితులు కంటే ఇప్పుడు పరిస్థితులు మరింత ఘోరంగా తయారయ్యిందని, పోలీసులను ఈ విషయంలో ఎక్కువగా వాడుకుంటోందని సమావేశంలో నాయకులు అభిప్రాయపడ్డారు.

Telugu Amaravathi, Ap, Chandrababu, Narendra Modi, Ys Jagan, Ysrcp-Telugu Politi

ఇక జగన్ విషయంలో కాస్త సానుకూలంగా కనిపించే సోము వీర్రాజు సైతం ప్రభుత్వ తీరుపై విమర్శలు చేయడంతో పాటు జగన్ పరిపాలనకు సంబంధించి నివేదికను కూడా ఆర్ఎస్ఎస్ నాయకులకు సమర్పించారు.ఈ సందర్భంగా వైసీపీ విషయంలో అన్ని మొహమాటాలు పక్కనబెట్టి విమర్శలు చేయాలని, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు సంబంధించిన అన్ని అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆర్ఎస్ఎస్ నాయకులు బిజెపి నాయకులకు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది.ఇలా చేయడం ద్వారా ప్రజా మద్దతు లభించడంతో పాటు ఏపీలో బీజేపీకి మరింత ఆదరణ పెరిగి వచ్చే ఎన్నికల నాటికి మెరుగైన ఫలితాలు వస్తాయని సమావేశంలో అభిప్రాయపడ్డారు.ఇదే విషయమై బిజెపి అధిష్టానం కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో ఏపీ బీజేపీ నేతలు వైసీపీ ప్రభుత్వం పై ముందు ముందు తీవ్ర స్థాయిలో విరుచుకుపడే అవకాశం కనిపిస్తోంది.

అయితే బిజెపి ఎంత కవ్వింపు చర్యలకు దిగుతున్నా వైసిపి ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో కేంద్రంతో అనవసర తగాదా ఎందుకు అన్నట్టుగా ఆ విమర్శలను పెద్దగా పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube