తెలుగు రాష్ట్రాల్లో కరోనా బాధితుల గణాంకాలు

ప్రపంచ దేశాలను వణికిస్తున్నటువంటి కరోనామహమ్మారి.భారతదేశాన్ని గడగడలాడిస్తున సంగతి తెలిసింది.అయితే మన తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు  పెరుగుతున్న సంగతి చూస్తూనే ఉన్నాము.

 Andhra Pradesh And Telangana Corona Virus Update Status,corona Virus Update,coro-TeluguStop.com

ఏపీ మరియు తెలంగాణలో కరొనా కేసుల చూసినట్లయితే

ఏపీలో కరోనా ఉద్రిక్తత తగ్గడం లేదు, రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య  1177 చేరగా,గడిచిన 24 గంటల్లో 80 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది.  ఇందులో కృష్ణాజిల్లా 33,గుంటూరు జిల్లా 23,కర్నూల్ 13, నెల్లూరు 7,పశ్చిమ గోదావరి 3 , శ్రీకాకుళం 1 గా నమోదైనట్లు పేర్కొన్నారు.కర్నూలు 292 కేసులతో రాష్ట్రంలో మొదటి స్థానం నిలిచింది.

రాష్ట్రంలో నలుగురు కరుణ మహమ్మారి నుంచి కోలుకున్నారు ఇందులో లో చిత్తూరు నుంచి ముగ్గురు పశ్చిమగోదావరి జిల్లా లో ఒకరు డిశ్చార్జ్ అయ్యారు, దీంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 235 చేరుకుంది.

తెలంగాణ లో గడచిన 24 గంటల్లో కేవలం 2 పాజిటివ్ కేసులు నమోదవగా దీంతో తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడుతుందని అర్థమవుతుంది.

ఇదిలా ఉండగా 2 పాజిటివ్ కేసులు కూడా జిహెచ్ఎంసి పరిధిలోని ఉన్నాయి అని అయితే ఇప్పటివరకు రాష్ట్రంలో లో కరొనా  పాజిటివ్ సంఖ్య 1003 కు చేరుకోగా మరణాల సంఖ్య 25  కాగా, డిశ్చార్జ్ అయిన వారు 332 చేరుకుంది ,  ఇంకా రాష్ట్రంలో  646 పాజిటివ్ కేసులు ఉన్నట్లు వెల్లడించారు.  దీనిని బట్టి చూస్తే రాష్ట్రంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తుంది

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube