ఎడిటోరియల్ : స్టీల్ ప్లాంట్ అమ్మేసుకోండి ... ఆపేవారు లేరిక్కడ

విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం ఒక క్లారిటీ కి వచ్చేసింది.ఇక ప్రభుత్వ ఆధ్వర్యంలో నడపడం అసాధ్యం, అసలు తమ పని అది కాదు అంటూ కేంద్రం తేల్చి చెప్పేసింది.

 All Political Parties Skeptical About Privatization Of Vizag Steel Plant ,  Viza-TeluguStop.com

రాష్ట్రాల నిర్ణయం ఇందులో ఏమీ లేదు.అంతా కేంద్ర నిర్ణయమే ఇది అని క్లారిటీ ఇచ్చేసింది.

ఎవరు వద్దు అన్నా, కాదు అన్నా స్టీల్ ప్లాంట్ ను అమ్మి తీరుతాం అంటూ స్పష్టమైన ప్రకటన చేసింది.స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసేందుకు వీలు లేదని, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ కొంతకాలంగాఏపీ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.

రాష్ట్ర బంద్ కు కూడా పిలుపు ఇచ్చారు.అన్ని రాజకీయ పార్టీలు రాజకీయంగా, ఆవేశంగా కేంద్రంపై విమర్శలు చేశాయి, చేస్తూనే ఉన్నాయి.

ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ, ఇప్పటికీ ఆందోళనలు నిర్వహిస్తూ,  కేంద్రానికి ఏపీ ఉద్యమ హీటు తెలిసొచ్చే విధంగా  ప్రయత్నం చేస్తున్నారు.అయితే రాజకీయ పార్టీలు చిత్తశుద్ధితో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయా అంటే అది పెద్ద చిక్కుముడి ప్రశ్నే.

ఎందుకంటే ప్రస్తుతం ఏపీలో అధికార పార్టీగా ఉన్న వైసిపి, కేంద్ర అధికార పార్టీ బిజెపి పై పోరాటం చేయలేని పరిస్థితుల్లో ఉంది.కేంద్రం ప్రైవేటీకరణకు మొగ్గు చూపించడమే కాకుండా , స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది.

అయినా, వైసిపి గట్టిగా కేంద్రంపై ఒత్తిడి చేసి తమకు ఎంపీల ద్వారా బీజేపీని భయపెట్టే ప్రయత్నం చేయలేకపోతోంది.అత్యధికంగా ఎంపీ లు వైసీపీకి ఉన్నా, ఎవరూ, నోరెత్తలేని పరిస్థితి.

అయితే వీరంతా స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో పాల్గొంటున్నా, కేంద్రం పై మాత్రం నోరు ఎత్తలేక పోతోంది.బిజెపికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు ముందుకు రాలేకపోవడంతో కేంద్రం మరింతగా ఈ వ్యవహారం లో ముందుకు వెళ్లేందుకు సులభతరం అవుతోంది.

ఇక ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇంతే.స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు తప్ప, కేంద్రంపై నోరు ఎత్తలేని పరిస్థితి టిడిపికి ఉంది.

దీనికి కారణం బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు టిడిపి ప్రయత్నించడం.బిజెపికి వ్యతిరేకంగా గొంతు ఎత్తితే, ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పటికే అనుభవపూర్వకంగా తెలియడం వంటి కారణాలతో కేంద్రంపై ఒత్తిడి చేయలేక, ఆ పార్టీని విమర్శించే లేని పరిస్థితి టిడిపిది.

Telugu Bjp, Central, Chandrababu, Jagan, Janasena, Pavan, Vizag Steel, Ysrcp-Tel

అసలు రాజకీయ పార్టీల తో పెట్టుకుంటే, విశాఖ స్టీల్ ప్లాంట్ ఆగేది కాదనే విషయం ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులతో పాటు, ప్రజలకు అర్థమైపోయింది.ప్రజా ఉద్యమాలు ఉవ్వెత్తున సాగితేనే తప్ప, రాజకీయ పార్టీల నాయకులను నమ్ముకుంటే , అసలు ఏమాత్రం ప్రయోజనం ఉండదు అనేది స్పష్టంగా అర్థం అయిపోయింది.ఏపీ లో నెలకొన్న రాజకీయం.కేంద్రం అంటే భయం భక్తి , ఇవన్నీ కేంద్ర బిజెపి ప్రభుత్వానికి ఏ ఇబ్బందులు లేకుండా చేస్తున్నాయి.ఇక ఏపీలో ఏ రాజకీయ పార్టీ కేంద్రం నిర్ణయాన్ని అడ్డుకోబోదు.ఇక స్టీల్ ప్లాంటే కాదు, ఏపీలో ఏది ప్రవేటీకరణ చేసినా అడ్డుకునేందుకు ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ నాయకుడు కానీ అడ్డు చెప్పరు.

ఇక అంతా మీ ఇష్టమే అంటూ సామాన్యులు కేంద్రం తీరును తప్పు పడుతున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube