సందట్లో సడేమియా : మందుపై ముందే మేల్కొంటున్న పార్టీలు !

ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లేందుకు అన్ని రాజకీయ పార్టీలు రకరకాల వ్యూహాలు, ఎత్తుగడలతో ముందుకు వెళ్తున్నాయి.అధికారం దక్కించుకునేందుకు ప్రతి పార్టీ అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకునే పనిలో పడ్డాయి.

 Andhra Pradesh All Political Parties Beware Of Cheap Liquors-TeluguStop.com

ఓటరు మహాశయులను ప్రసన్నం చేసుకునేందుకు తమదైన శైలిలో ఎరలు వేసేపనిలో పడ్డాయి.మరీ ముఖ్యంగా చెప్పుకుంటే ఎన్నికలంటే అందరి దృష్టి మద్యం పైనే పడుతుంది.

ఎన్నికల నోటిఫికేషన్‌ తర్వాత కోడ్‌తో పాటే తనిఖీలు ఎక్కువయ్యే అవకాశం ఉండడంతో ముందుగానే మద్యాన్ని సేకరించుకుని క్షేత్రస్థాయికి తరలించి భద్రపరచుకునే దిశగా అడుగేలేస్తున్నారు.

ఏపీలో ప్రస్తుతం ఎన్నికల సందడి మొదలవ్వడంతో ముందస్తు మద్యం నిల్వలకు భారీగా తెరలేపారు.దీనిలో భాగంగానే.మద్యం కర్తనులు రహస్య డిపోల్లోకి, బెల్టుషాపుల్లోకి తరలించే పనిలో పడ్డాయి రాజకీయ పార్టీలు.

ఎన్నికల నోటిఫికేషన్ కి ఇంకా ఎంతో సమయం లేకపోవడంతో ఏఈ ముందస్తు నిల్వలకు తెరలేపినట్టు తెలుస్తోంది.ఈ విషయాన్ని ఎక్సైజ్ శాఖ అధికారిక లెక్కలు ధృవీకరిస్తున్నాయి.ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన నాయకులు కొందరు ముందస్తు మద్యం సేకరణలో బాగా యాక్టివ్ గా ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఒక్కసారి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యింది అంటే.

మద్యం అమ్మకాల విషయంలో అనేక రూల్స్ అమల్లోకి వచ్చేస్తాయి.ప్రధానంగా సంవత్సరంలో నెలలో ఒక తేదీన ఎంత మద్యాన్ని విక్రయించారో అదే పరిమాణంలో ఎన్నికల సమయంలో కూడా అమ్మకాలు చేయాల్సి ఉంటుంది.

ఇంతకు మించి ఎక్కువ విక్రయిస్తే నిబంధనలను అతిక్రమించినట్టే.గత జనవరిలో పోలిస్తే ఈ సంవత్సరం జనవరి నెలలో ఏడు శాతం లిక్కర్, 23 శాతం బీరు అమ్మకాలు అధికంగా అమ్మినట్టు తెలుస్తోంది.

అలాగే ఫిబ్రవరి లో వందల కోట్ల రూపాయల మద్యాన్ని విక్రయించినట్టుగా మద్యం డిపోల్లో లెక్కలే చెప్తున్నాయి.దీనిలో 33.4 లక్షల కేసుల లిక్కర్, 27 లక్షల కేసుల బీర్లు డిపోల నుంచి సరఫరా అయినట్లు అధికారిక లెక్క.ఇది గత సంవత్సరంతో పోలిస్తే 500 కోట్లు ఎక్కువ ఉంది అని అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తోంది.

నోటిఫికేషన్ రావడానికి మరో వారం రోజులు గడువు ఉండడంతో ఈ వారం రోజుల్లోనే కనీసం రెండు వేల కోట్ల రూపాయల మద్యాన్ని అక్రమంగా నిలువ చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube