అమెరికాలో ఆంధ్రుల వనభోజనాలు...!!!

తెలుగు వారికి కార్తీక మాసం ఎంతో ముఖ్యమైన మాసంగా భావిస్తారు.కార్తీక దీపాలు, పూజలు వ్రతాలతో ఆ మాసం మొత్తం ఎంతో దేదీప్యమానంగా ఉంటుంది.

 Andhra People Wana Bhojanalu Ar America-TeluguStop.com

తెలుగు వారు ఎక్కడ ఉన్నా సరే కార్తీక మాసం జరుపుకోకుండా ఉండరు.ఇదిలాఉంటే కార్తీక మాసంలో ముఖ్యంగా అందరూ కలిసి జరుపుకునే వనసమారాధన బంధాలకి,మానవ సంబంధాలకి నిలయంగా ఉంటుంది.

అందుకే కార్తీక మాసంలో అందరూ కలిసి కట్టుగా వన భోజనాలు ఏర్పాటు చేసుకుంటారు.అయితే ఎల్లలు దాటినా సరే ప్రవాసాంధ్రులు మాత్రం మన సంస్కృతీ సాంప్రదాయలని ఏ మాత్రం విడిచిపెట్టలేదు , మర్చిపోలేదు, అందుకే అమెరికాలో సైతం కార్తీక మాసం ఎంతో ఘనంగా జరుపుకున్నారు.

వన భోజనాలు ఏర్పాటు చేసుకుని ఎంతో సంతోషంగా గడిపారు.

Telugu Andhrawana, Bhojanaluar, Telugu Nri Ups-

అమెరికాలోని మిసిసిపీ రాష్ట్రంలో రిడ్జ్ ల్యాండ్ నగరంలో స్థానికంగా ఉన్న ప్రవాసాంధ్రులు కార్తీక వన సమారాధన ఏర్పాటు చేసుకున్నారు.సుమారు 200 మంది తెలుగు వారు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ముందుగా తులసి, ఉసిరి మొక్కలకి పూజలు చేసి , తెలుగు వంటలు తయారు చేసుకుని, ఆరగించారు.

పిల్లలు పెద్దలు తేడా లేకుండా అందరూ ఆట పాటలతో సంతోషంగా గడిపారు.విజేతలకి నిర్వాహకులు బహుమతులు అందచేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube