రైల్వే జోన్ పై పెదవి విరుస్తున్న ఏపీ ప్రజలు!

ఏపీ విభజన హామీలలో ఒకటిగా, ఉత్తరాంద్ర ప్రజలను మూడు దశాబ్దాలుగా కోరుకుంటున్న విశాఖ రైల్వే జోన్ ని కేంద్రం ఊహించని విధంగా ఎన్నికల ముందు ప్రకటించింది.ప్రధాని మోడీ మార్చి 2న విశాఖలో పర్యటించడానికి మూడు రోజుల ముందుగా రైల్వేజోన్ ప్రకటించి ఏపీ ప్రజల దశాబ్దాల కలని నేరవేర్చామనే కలరింగ్ ఇచ్చే ప్రయత్నం బీజేపీ పార్టీ చేస్తుంది.

 Andhra People Fully Disappointed On Vizag Railway Zone-TeluguStop.com

అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రైల్వే జోన్ విషయంలో ఏపీ ప్రజలు తీవ్ర అసంతృప్తితో వున్నట్లు తెలుస్తుంది.

విశాఖ రైల్వే జోన్ ని ప్రకటించి ఏపీకి ఎక్కువ ఆదాయాన్ని తెచ్చి పెట్టె వాల్తేర్ డివిజన్ ని రైల్వే శాఖ వాల్తేర్ డివిజన్ లో ఈస్ట్ కోస్ట్ జోన్ లో చేర్చడం, ఎ మాత్రం ఆదాయం లేని గుంటూరు, విజయవాడ, గుంతకల్లు జోన్ లని సౌత్ కోస్ట్ జోన్ గా వైజాగ్ రైల్వే జోన్ ప్రకటించడంతో అధికార పార్టీ టీడీపీ విమర్శలు చేసింది.

వైసీపీ ఈ రైల్వే జోన్ ని సమర్ధించిన, ఉత్తరాంద్ర ప్రజలు మాత్రం వాల్తేర్ డివిజన్ లేకుండా విశాఖ రైల్వే జోన్ ని ఊహించుకోలేమని చెబుతున్నారు.బీజేపీ రైల్వే జోన్ ఇచ్చినట్లే ఇచ్చి తమ బుద్ధిని చూపించుకొని ఆదాయాన్ని ఇచ్చే వాల్తేర్ డివిజన్ ని లాగేసుకొని ఏదో తూతూ మంత్రంగా ఇచ్చారని ఉత్తరాంద్ర మేధావులు, రాజకీయ ప్రముఖుల నుంచి వినిపిస్తుంది.

మరి ఈ విమర్శలకి బీజేపీ సర్కార్ ఎం సమాధానం చెబుతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube