కేసీఆర్ పై ఆంధ్రా ప్రజల గుర్రు..ఒక్క ఓటు కూడా వెయ్యం

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కి వచ్చే ఎన్నికల్లో ఆంధ్రా ఓటర్లు చుక్కలు చూపించనున్నారా .? ఒక్కటంటే ఒక్క ఆంధ్రావాళ్ళ ఓటు పడదని కేసీఆర్ రిపోర్ట్ లో తేలిందా.? ఒకప్పుడు కేసీఆర్ ని ఎంతో సొంత మనిషిలా చూసుకున్న ఆంధ్రా ఓటర్లు ఇప్పుడు ఛీ కొడుతున్నారు.టీఆర్ఎస్ వాళ్ళు ఓట్లు అడిగితే కనీసం తలుపులు కూడా తీయం అంటూ కేసీఆర్ పై తమ ఆవేశాన్ని వ్యక్తపరిస్తున్నారు.వివరాలలోకి వెళ్తే ,

 Andhra People Fire On Kcr Over Special Status Issue-TeluguStop.com

తెలంగాణ సీఎం కేసీఆర్ కి వచ్చే ఎన్నికల్లో ఆంధ్రోడి వాళ్ళ దెబ్బ గట్టిగానే తగులుతుందట.అయితే దానికి నిదర్సనమే.మొన్న కర్ణాటకాలో జరిగిన ఎన్నికలు అంటున్నారు.మేము నమ్మితే గుండెల్లో పెట్టుకుని చుసుకుంటామని మాకు గాని మా ఆంధ్రా కి గాని చిన్న హాని తలపెట్టినా ఊరుకోబోమని అంటున్నారట.

సాటి తెలుగు రాష్ట్రం అయిన ఎపీకి కేంద్రం చేస్తున్న సహాయనిరాకరణ తో దేశంలో కొన్ని రాష్ట్రాలు కేంద్రం వైఖరిని ఎండగడుతున్నాయి మమతా, నితీష్, కుమారస్వామి వంటి నెతలు ఆంధ్రాకు అండగా నిలుస్తున్నారు అయితే కేసీఆర్ మాత్రం కనీసం ఒక్క మాటకూడా మాట్లాడక పోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

దాంతో ఇప్పుడు తెలంగాణా లో ఉంటున్నా ఆంధ్రా ప్రజలు ఈ విషయాన్ని ఎంతో సీరియస్ గా తీసుకున్నారట.

ఆంధ్రా ప్రజలు తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే టీజీ వెంకటేష్ లాంటి వాళ్ళు తాజాగా చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ ని మరింతగా ఇరుకున పెట్టేశాయి.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు చేస్తున్న పోరాటంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతులు కలపాలని ఏపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ కోరారు.లేకపోతే కేసీఆర్‌ ఇబ్బంది పడాల్సి వస్తుందని హెచ్చరించారు.

రాష్ట్ర విభజన సమయంలో ఏపీ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తానని కేసీఆర్‌ మాట ఇచ్చారని, ధనిక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన దాన్ని నిలుపుకోవాలని పిలుపునిచ్చారు.

అయితే కేసీఆర్ ఈ పిలుపుకి కలిసి రాకపోతే కర్ణాటక ఎన్నికల తరహాలోనే తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఓటేయాలని ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల ఓటర్లకు పిలుపునివ్వాల్సి వస్తుందని హెచ్చరించారు…మోడీ దగ్గర కనీసం ఆంధ్రా గురించి ఒక్క సారి కూడా నోరు మెదపక పోవడం తో ఆంధ్రా ప్రజలు ఇప్పటికే గుర్రుగా ఉన్నారు అయితే తాజాగా టీజీ వెంకటేష్ చేసిన ఈ వ్యాఖ్యలతో తెలంగాణలోని ఏపీ ప్రజలు మరింతగా కేసీఆర్ పై గుర్రుగా ఉన్నారట…అయితే టీజీ చేసిన వ్యాఖ్యలని తెలంగాణా టీఆర్ఎస్ నేతలు ఖండించారు.

టీజీ చేసిన వ్యాఖ్యలలో నిజం లేదని కేసీఆర్ తెలుగుప్రజల పక్షపాతి అంటూ వెనకేసుకొస్తున్నా లోలోపల మాత్రం ఏపీ ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని భయపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube