ఆంధ్ర ప్రభుత్వ కంట్రోలు రూములు

నేపాల్‌ వెళ్లి ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకుల సమాచారాన్ని వారి బంధువులకు ఎప్పటికప్పుడు చేరవేయడానికి, వారు అడిగిన సమాచారం అందించడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కంట్రోలు రూములు ఏర్పాటు చేసింది.హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో, ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్‌ భవన్లో కంట్రోలు రూములు ఏర్పాటు చేశారు.

 Andhra Opens Control Rooms-TeluguStop.com

ఇవి ఇరవైనాలుగు గంటలూ పనిచేస్తాయి.నేపాల్‌లో పరిస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షించారు.

నేపాల్‌లో ఉన్న తెలుగువారిని సురక్షితంగా రాష్ర్టానికి రప్పించాలని ఆదేశించారు.ఆయన స్వయంగా విదేశాంగ శాఖ అధికారులతో మాట్లాడారు.

పశ్చిమ గోదావరి జిల్లా నుంచి యాభైరెండు మంది, విజయవాడ నుంచి నలభై మంది నేపాల్‌కు పర్యాటకులుగా వెళ్లారు.హుద్‌హుద్‌ తుపాను సమయంలో, ఉత్తరాఖండ్‌లో రెండేళ్ల క్రితం వచ్చిన వరదల్లో తెలుగువారు చిక్కుకుపోయిన సమయంలో చంద్రబాబు చేసిన కృషి ప్రశంసలు పొందింది.

అప్పుడు అధికారంలో లేకపోయినా పార్టీ నిధులు ఖర్చు చేసి హెలిక్యాప్టర్లను పంపి బాధితులను ఢిల్లీకి తెచ్చారు.అక్కడి నుంచి రైళ్లలో సొంత ప్రాంతాలకు చేర్చారు.

నాయకుడైనవాడికి ఇలాంటి చొరవ అవసరం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube