సెల్ఫీలతో ఇండియా బుక్ రికార్డ్ సొంతం చేసుకున్న ఆంధ్రా కుర్రాడు !

ఇది వరకు రోజుల్లో ఫోటోలు దిగాలంటే స్టూడియోకు వెళ్లి దిగేవారు.కానీ ఇప్పుడు మాత్రం చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు సెల్ఫీ లు దిగుతున్నారు.

 Andhra Man Created India Book Of Record For Taking Selfies, India Book Of Record-TeluguStop.com

వాళ్లకు నచ్చిన ప్లేస్ కనిపించిన నచ్చిన డ్రెస్ వేసుకున్న ఇలా ఎక్కడ బడితే అక్కడ సెల్ఫీలు దిగుతూ ఉన్నారు నేటి యువత.ఈ సెల్ఫీల కారణంగా చాలా మంది తమ ప్రాణాలను కూడా కోల్పోయారు.

సెల్ఫీల మోజులో పడి ముందు వెనుక చూసుకోకుండా ప్రమాదాలను కోరి తెచ్చుకునేవారు.

అయితే ఒక కుర్రాడు మాత్రం సెల్ఫీ తో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ ను సొంతం చేసుకున్నాడు.

అది ఎలాగా.సెల్ఫీలు దిగితే ఇండియా బుక్ రికార్డ్ ఎలా సొంతం అవుతుందా అని ఆలోచిస్తున్నారా.

నిజమే మాములు సెల్ఫీలు అయితే మీరు అనుకున్నట్టు ఏ అవార్డులు రావు.కానీ ఆ కుర్రాడు దిగింది మాములు సెల్ఫీలు కాదు.

సమాజానికి ఉపయోగ పడే సెల్ఫీలు దిగి నేటి యువతకు ఆదర్శంగా మారాడు.

చిత్తూరు జిల్లా చంద్రగిరి చెందిన చరిత్ చిన్న వయసు నుండే శుభ్రత గా ఉండడమంటే చాలా ఇష్టం.

చదువు పూర్తి చేసి 2014 లో కేరళ లోని ఎసిబిఐ బ్యాంక్ లో ఉద్యోగంలో చేరాడు.

Telugu Andhra India, India, India Railways, Railway, Bankindia, Swatch Bharath,

అక్కడి నుండి తరచూ తన సొంత ఊరుకి రైలు ప్రయాణం చేసేటప్పుడు అన్ని స్టేషన్లు పరిశుభ్రంగా ఉండడం చూసి అతడు చాలా ఆశ్చర్య పోయాడు.స్వచ్ఛ భారత్ కారణంగానే ఇంత మార్పు వచ్చిందని తెలుసుకున్నాడు.

ఇక అప్పటి నుండి తాను ప్రయాణించే ప్రతి స్టేషన్లో సెల్ఫీ దిగడం అలవాటు చేసుకున్నాడు.

ఆ ఊరు పేర్లతో ఉన్న బోర్డుల దగ్గర సెల్ఫీ తీసుకునేవాడు.ఆ సెల్ఫీలను పేస్ బుక్ లో పోస్ట్ చేసే వాడు.

తన ఫోటో కలెక్షన్ ను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ సంస్థ వారు అరుదైన సెల్ఫీలుగా వీటిని గుర్తించి 2019 లో మొమెంటో తోపాటు డాక్టరేట్ తో సత్కరించారు.

Telugu Andhra India, India, India Railways, Railway, Bankindia, Swatch Bharath,

అలా ఇప్పటి వరకు చరిత్ ఉద్యోగ రీత్యా 10 రాష్ట్రాల్లో తిరిగాడు.తన ప్రయాణంలో ఇప్పటి వరకు 310 సెల్ఫీలు దిగాడు.ప్రస్తుతం చరిత్ తిరుపతి ఎసిబిఐ లో మేనేజర్ గా పనిచేస్తున్నాడు.

గిన్నిస్ బుక్ లో స్థానం సాధించాలనేదే తన కోరిక అని చరిత్ చెబుతున్నాడు.ఇప్పటి వరకు సెల్ఫీలతో ప్రాణాలు పోగొట్టుకోవడమే మనం చూసాం.

కానీ సెల్ఫీ కారణంగా అవార్డు కూడా పొందడం ఇప్పుడు చూస్తున్నాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube