ఆంధ్ర భాజాపాకు కొత్త డాక్టర్ కిరణ్ కుమార్ !

నిజానికి ఆంధ్రప్రదేశ్లో భాజపా పరిస్థితి నోటా కంటే దారుణంగా ఉన్నప్పటికీ భాజపా పెద్దలు మాత్రం ఆంధ్రప్రదేశ్ పై ఆశలు వదులుకోవడం లేదు.ముఖ్యంగా ఏమీలేని చోట కూడా ఏదో ఒక ప్రయత్నం చేసే భాజపా( BJP party ) నాయకులు గతంలో కొంత ఓటు బ్యాంకు సాధించిన ఏపీ లాంటి రాష్ట్రాలు అసలు వదిలే సమస్య లేదు.

 Andhra Bjp's New Doctor Kiran Kumar! , Nallari Kiran Kumar Reddy , Daggubati Pu-TeluguStop.com

ముఖ్యంగా ఆంధ్ర- తెలంగాణకు సంబంధించినంత వరకూ ఎంపి ల బలం అవసరమయినప్పుడు లోపాయికారి ఒప్పందాలతో మేనేజ్ చేస్తున్నప్పటికీ భవిష్యత్తులో పరిణామాలు అనుకూలం గా లేకపోతే తమకంటూ సొంత ఓటు బ్యాంకు ఉండాలని భావిస్తున్న కమలనాధులు ఆంధ్ర తెలంగాణపై గట్టిగానే ఫోకస్ పెట్టారు .అసెంబ్లీ ఎన్నికల వరకు ఎలా పోరాడినా కానీ కచ్చితంగా పార్లమెంట్ స్థానాల వరకు కచ్చితంగా కొంత నెంబర్ను ఈ రెండు రాష్ట్రాల నుంచి కేంద్ర బాజాపా ఆశిస్తుంది .

Telugu Amith Shah, Ap, Jana Sena, Nallarikiran, Narendra Modi, Ys Jagan-Telugu P

ఇప్పుడు ఈ దిశగానే భాజపా కొత్త నాయకుడు కిరణ్ కుమార్ రెడ్డి( Nallari Kiran Kumar Reddy )ని కేంద్ర కార్యవర్గ సభ్యుడు హోదాలో ఆంధ్రప్రదేశ్కు పంపిస్తుంది.గతంలో కాంగ్రెస్లో ముఖ్యమంత్రి హోదాలో పనిచేసిన కిరణ్ కుమార్ అనుభవం ఆయన పరిచయాలు ఆంధ్ర రాష్ట్రంలో భాజాపాకు ఎంతో కొంత సానుకూలత తీసుకొస్తాయని ఆశిస్తున్న కేంద్రభాజాప ఆ దిశగా ఆయన పై పెద్ద బాధ్యతే ఉంచినట్టు తెలుస్తుంది కీలక నాయకులను పార్టీ వైపు ఆకర్షించడం , క్రియాశీలక కార్యకర్తలను యాక్టివేట్ చేయడం పార్టీ కి అనుకూలంగా ఉన్న స్థానాలను గుర్తించి అభివృద్ధి చేయటం వంటి లక్ష్యాలతో విశాఖ లో అడుగుపెడుతున్న కిరణ్ కుమార్ ఏ మేరకు ఈ లక్ష్యాలు సాదించ గలరో చూడాలి.

Telugu Amith Shah, Ap, Jana Sena, Nallarikiran, Narendra Modi, Ys Jagan-Telugu P

కొత్త అధ్యక్షురాలు పురందేశ్వరి( Daggubati Purandeswari ) నియామకంతో బాజాపా కు రాజకీయ అవకాశాలు పెరుగుతాయని భావించినప్పటికీ రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితులలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధాలతో భాజపా నాలుగవ స్థానానికి వెళ్లిపోయింది.అయితే ఎన్నికలకు దగ్గరకు వచ్చే అవకాశాలను ప్రజల ఆసక్తి ని తమ వైపు మళ్లించుకుని చెప్పుకోదగ్గ స్థానాలను గెలుచుకునే ఉద్దేశంతో భాజపా ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది .మరి ఆంధ్ర రాజకీయాల్లో భాజాపాకు ఏ మేరకు అవకాశం ఉంటుందో చూడాలి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube