ఆ రీమేక్ లో నితిన్ కి జోడీగా ఇస్మార్ట్ పాప

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తాజాగా భీష్మ సినిమాతో సాలిడ్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.ఇదే స్పీడ్ తో ఏకంగా నాలుగు సినిమాలని నితిన్ లైన్ లో పెట్టాడు.

 Nabha Natesh Romance With Nithin, Tollywood, Andhadhun Movie Remake, Merlapaka G-TeluguStop.com

అందులో హిందీలో ఆయుష్మాన్ హీరోగా తెరకెక్కిన అందాదున్ రీమేక్ కూడా ఒకటి.ఈ సినిమాని తెలుగులో మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి రీమేక్ చేస్తున్నారు.

ఈ సినిమాని త్వరలో సెట్స్ పైకి తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.ఇక హిందీలో టబు చేసిన పాత్ర కోసం తెలుగులో ఆమెతో పాటు, రమ్యకృష్ణని కూడా సంప్రదిస్తున్నారు అలాగే అనసూయ పేరు కూడా వినిపిస్తుంది.

ఎవరనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు.ఇక రాధికా ఆప్టే చేసిన హీరోయిన్ పాత్ర కోసం ఇప్పుడు ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ ని కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తుంది.

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన ఈ అమ్మడు ప్రస్తుతం కుర్ర హీరోలకి ఛాయస్ గా ఉంది.ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో మెగా హీరో సోలో బ్రతుకే సో బెటరు సినిమాతో పాటు, బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ సినిమాలు ఉన్నాయి.

ఇందులో మెగా హీరో మూవీ రిలీజ్ కి రెడీ అవుతుంది.మరో వైపు రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజగా హీరోగా తెరకెక్కనున్న సినిమాలో నభా నటేష్ ఒక హీరోయిన్ గా కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుంది.

ఇప్పటికే డిస్కో రాజా సినిమాలో రవితేజతో ఈ భామ రొమాన్స్ చేసింది.ఇదిలా ఉంటే ఇప్పుడు నితిన్ కి జోడీగా అవకాశం సొంతం చేసుకోవడం ద్వారా తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి కావాల్సిన పునాదులని ఈ భామ మరింత స్ట్రాంగ్ గా వేసుకుంటుంది అనే చర్చ నడుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube