ఇక కేసీఆర్ టార్గెట్ గా షర్మిల భారీ వ్యూహం... అదేంటంటే?

తెలంగాణలో రాజకీయ వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది.అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతూ రాజకీయ రణరంగంగా మారిందనే చెప్పవచ్చు.

 And Sharmilas Huge Strategy As A Kcr Target Is That-TeluguStop.com

తెలంగాణలో అకస్మాత్తుగా రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చి షర్మిల రాజకీయ వర్గాలను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది.ఓ పత్రిక కథనం మేరకు షర్మిల ఎంట్రీ ఇస్తున్నట్టు తెలిసిన కొద్దీ రోజులకే షర్మిల తన పొలిటికల్ ఎంట్రీని కన్ఫర్మ్ చేసిన విషయం తెలిసిందే.

ఆ తరువాత జిల్లాల వారీ నేతలతో సమావేశమైన షర్మిల పార్టీని స్థాపిస్తే క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఎలా ఉంటాయి అనే దానిపై సమావేశం నిర్వహించింది.

 And Sharmilas Huge Strategy As A Kcr Target Is That-ఇక కేసీఆర్ టార్గెట్ గా షర్మిల భారీ వ్యూహం… అదేంటంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ తరువాత ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించిన తెలిసిందే.

అయితే ఈ సందర్బంగా పార్టీ పేరును ప్రకటిస్తుందని ఆశించిన అభిమానులకు నిరాశ ఎదురైంది. వైఎస్ జయంతి రోజున పార్టీ ప్రకటన చేస్తానని తెలిపింది.

అయితే కేసీఆర్ దొర పాలనకు చరమగీతం పాడాలని షర్మిల పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.అయితే నేడు షర్మిల నిరుద్యోగులకు తక్షణమే నోటిఫికేషన్ లు ప్రకటించాలని, లేకపోతే ప్రజల తరపున పోరాడుతూ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు, ధర్నాలకు పిలుపునిస్తామని షర్మిల ప్రకటించింది.

ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన ఈ ధర్నాలో వైఎస్ విజయమ్మ పాల్గొనడం జరిగింది.ఏది ఏమైనా షర్మిల వేసిన నిరాహారదీక్ష వ్యూహం కొంత మేర సఫలం అయిందనే చెప్పవచ్చు.

#LikelyTo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు