ఇక కాంగ్రెస్ సీనియర్ లు అలక వీడినట్టేనా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఇచ్చిన పార్టీగా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో విఫలమయినా ఆ తరువాత జరిగిన నష్టాన్ని సవరించుకునే దిశగా ముందడుగు వేయని పరిస్థితి ఉంది.అంతేకాక పార్టీలో అంతర్గత పోరు పార్టీని మరింతగా దిగజార్చిందని చెప్పవచ్చు.

 And Did The Congress Seniors Leave Disappointment Revanth Reddy, Congress Party,-TeluguStop.com

ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నిర్మాణంపై దృష్టి సారించకపోతే ఇక కాంగ్రెస్ బాలపడుతుందని విశ్వసించని పరిస్థితి ఏర్పడుతుంది.ఇక ఆ తరువాత అధికార పార్టీ మరింతగా బలపడితే ఆపరేషన్ ఆకర్ష్ తో కాంగ్రెస్ ను మరింత నీరుగార్చే ప్రయత్నం చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘోర ఓటమికి సంబంధించి ఢిల్లీలోని వార్ రూమ్ లో హాట్ హాట్ డిబేట్ జరిగిన విషయం తెలిసిందే.అయితే ప్రస్తుతం చాలా వరకు కాంగ్రెస్ లో అంతర్గత పోరు నశిస్తేనే ఎంతో కొంత కాంగ్రెస్ వైపు ప్రజలు చూసే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

అయితే తాజాగా జరిగిన వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన నిరసనలో కాంగ్రెస్ సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు పాల్గొనడంతో కాంగ్రెస్ లో ఈ సీనియర్ ల కోల్డ్ వార్ కు సంబంధించిన విషయం ఓ కొలిక్కి వచ్చిందనే ప్రచారం సాగింది.ఏది ఏమైనా ఈ తరహా ప్రచారం కాంగ్రెస్ కార్యకర్తలను కొంత సంతోషపరిచిందనే చెప్పవచ్చు.

Telugu Revanth Reddy, Battivikramarka, Congress, Komati Reddy, Telangana, Ts Pot

ఏది ఏమైనా వ్యక్తిగత స్వార్థం కొరకు పార్టీ ప్రతిష్టను పెంచేలా ఏ మాత్రం కృషి చేయకపోతే క్షేత్ర స్థాయి కార్యకర్తలు నిరాశకు గురయ్యే ప్రమాదం ఉంది.ఇక ఆ తరువాత కార్యకర్తలు క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు పనిచేయకపోతే నాయకులు ఎన్ని నిరసనలు పోరాటం చేసినా వృధా అవుతుందనే విషయం మానకు తెలిసిందే.ఏది ఏమైనా కాంగ్రెస్ సీనియర్లు అలకవీడి ఒక్కటిగా పోరాడితే కాంగ్రెస్ కు ఎంతో కొంత లాభించే అంశంగా మనం చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube