ఇక టీఆర్ఎస్ పై పోరాటంపై కాంగ్రెస్ నేతలు ఆ నిర్ణయానికి వచ్చారా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు టీఆర్ఎస్ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తూ కార్యాచరణను రూపొందించుకుంటున్న విషయం తెలిసిందే.అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీగా మారాలని ప్రయత్నిస్తున్న తరుణంలో బీజేపీ నుండి తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

 And Did The Congress Leaders Come To That,kcr, Trs Party , Bjp , Congress Par Decision On The Fight Over The Trs Ty ,-TeluguStop.com

అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎక్కడా తగ్గేదే లే అన్నట్లుగా టీఆర్ఎస్ పార్టీపై, కేసీఆర్ పై వరుస విమర్శలు గుప్పిస్తూ ముందుకు సాగుతోంది.అయితే రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పార్టీ తో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ అనేది సంస్థాగతంగా బలంగా ఉన్నా అంతర్గత పోరు వల్ల ప్రజల్లోకి బలంగా వెళ్లలేక పోతున్న పరిస్థితి ఉంది.

అయితే టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోరాడటంలో కాంగ్రెస్ పార్టీ నేతలు అందరూ కలిసి రానటువంటి పరిస్థితి ఉంది.ఇదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అతి పెద్ద సంకటంగా మారింది.

 And Did The Congress Leaders Come To That,kcr, Trs Party , Bjp , Congress Par Decision On The Fight Over The TRS Ty ,-ఇక టీఆర్ఎస్ పై పోరాటంపై కాంగ్రెస్ నేతలు ఆ నిర్ణయానికి వచ్చారా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

టీఆర్ఎస్ పై పోరాటం విషయంలో చాలా క్లారిటీగా వెళ్తేనే కొంత కాంగ్రెస్ ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లవచ్చు ననే అభిప్రాయాన్ని ఇతర కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది.సాధ్యమైనంత మేర కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున అంశాల వారీగా వెళ్తేనే కొంత ప్రజల దృష్టిని ఆకర్షించుకునే అవకాశం ఉంటుందని అందుకే రానున్న రోజుల్లో టీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టే విధంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

అయితే సార్వత్రిక ఎన్నికలు ఇంకా రెండున్నర సంవత్సరాలలో రానున్న తరుణంలో  కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలమైన కార్యాచరణను పకడ్భందీగా అమలు చేస్తేనే గత ఎన్నికల కంటే మెరుగైన స్థానాలు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీ ఇంకా బహిరంగంగా వ్యూహంపై చర్చకు తెరదీయకున్నా వచ్చే ఎన్నికల్లో మాత్రం గెలుపుపై మాత్రం పూర్తి నమ్మకంగా ఉన్నట్టు తెలుస్తోంది.

Video : And Did The Congress Leaders Come To That,kcr, Trs Party , Bjp , Congress Par Decision On The Fight Over The TRS Ty ,

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube