అయోధ్యలో బయటపడుతున్న హిందుత్వ ఆనవాళ్ళు… భారీ శివలింగం లభ్యం  

Ancient Idols Pillars And Shiv Ling Found In Ayodhya - Telugu Ancient Idols, Delhi, Hinduism, Muslim, Pillars And Shiv Ling Found In Ayodhya

అయోధ్య రామజన్మభూమి వివాదం ఎన్నో దశాబ్దాలుగా హిందువులు, ముస్లింల మధ్య ఆధిపత్య పోరుగా ఉంది.అక్కడ ఒకప్పుడు రామమందిరం ఉండేదని హిందువులు వాదిస్తే, అక్కడ ఎలాంటి హిందుత్వ ఆనవాళ్ళు లేవని, అక్బర్ కాలంలో కట్టిన మసీద్ మాత్రమే ఉందని ముస్లింలు వాదిస్తూ వచ్చారు.

 Ancient Idols Pillars And Shiv Ling Found In Ayodhya

అయితే సుప్రీం కోర్టు ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టి అయోధ్య రామజన్మభూమి హిందువులకి చెందుతుందని తీర్పు చెప్పింది.దానికి సమీపంలో ఐదు ఎకరాల భూమిని మసీదు నిర్మాణం కోసం కేటాయించింది.

ఈ నేపథ్యంలో, అయోధ్యలోని రామజన్మభూమి వద్ద నిర్మాణ పనులు జరుగుతుండగా అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ అక్కడో హిందుత్వ ఆనవాళ్ళు లభ్యం అవుతున్నాయి.

అయోధ్యలో బయటపడుతున్న హిందుత్వ ఆనవాళ్ళు… భారీ శివలింగం లభ్యం-General-Telugu-Telugu Tollywood Photo Image

అక్కడ ఓ భారీ శివలింగం లభ్యమైంది.

శివలింగం ఎత్తు ఐదు అడుగులు ఉన్నట్టు గుర్తించారు.అక్కడి శిథిలాలను తొలగిస్తుండగా, శివలింగంతో పాటు 7 నల్లరాతి స్తంభాలు, 6 ఎర్రరాతి స్తంభాలు, ఓ కలశం, విరిగిపోయిన స్థితిలో మరికొన్ని దేవతామూర్తుల విగ్రహాలు బయటపడ్డాయి.

ఇటీవలే అక్కడ పూర్ణకుంభం కూడా బయల్పడిందని వీహెచ్ పీ నేత వినోద్ భన్సల్ తెలిపారు.ఈ ఆనవాళ్ళు ఆధారంగా అక్కడం ఒకప్పుడు హిందుత్వ సనాతన ధర్మం గొప్పగా ఉండేదని తెలుస్తుంది.

అక్కడ దొరికిన శివలింగం, రాతి స్తంభాలు ఏ కాలం నాటివి అని తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ancient Idols Pillars And Shiv Ling Found In Ayodhya Related Telugu News,Photos/Pics,Images..