తారలు సరే.. యాంకర్ల మాటేంటి?

కరోనా వైరస్ దెబ్బకు యావత్ ప్రపంచం గడగడలాడుతోంది.ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మందికి కరోనా వైరస్ సోకగా, 50వేల మంది మృత్యువాత పడ్డారు.

 Anchors Yet To Come Forward, Corona Virus, Donations, Anchors, Artists-TeluguStop.com

ఇటు భారత్‌లో కూడా ఈ మహమ్మారి రోజురోజుకూ తన ప్రతాపం చూపుతోంది.అయితే అందరూ కలిసికట్టగా ఈ వైరస్‌ను నివారించేందుకు ప్రధాని నరేంద్ర మోది దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే.

దీంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి.అటు సినీ రంగానికి చెందిన అన్ని పనులు కూడా మూతపడ్డాయి.

దీంతో వేల మంది సినీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.వీరంతా రోజూ పని చేసుకుంటేనే జీవితాన్ని గడిపే వారు కావడంతో, వీరిని ఆదుకునేందుకు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ముందుక వచ్చారు.

ఇప్పటికే స్టార్ హీరోలు మొదలు చిన్న స్థాయి హీరోల వరకు తమకు తోచిన విరాళం అందిస్తూ సినీ కార్మికులను ఆదుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

కాగా ఎప్పుడూ బిజీగా ఉంటూ, చేతినిండా డబ్బులు సంపాదించే యాంకర్లు మాత్రం పెద్దగా ముందుకు రాకపోవడం గమనార్హం.

ఒకరిద్దరు మినహా యాంకర్లు ఎవరూ సినీ కార్మికులను ఆదుకోవడనాకి ముందుకు రాకపోవడం శోచనీయం అని అంటున్నారు సినీ విశ్లేషకులు.వారందరూ ముందుకు వచ్చి తమవంతు సాయం చేస్తే సినీ ఇండస్ట్రీని కాపాడిన వారవుతారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube