టాలీవుడ్ లో యాంకర్లుగా వచ్చి.. హీరోయిన్ లుగా మారిన వారు వీళ్లే?

సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది ఊహకందని విధంగానే ఉంటుంది.కొన్ని కొన్ని సార్లు వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన వారు అక్కడ కలిసిరాక బుల్లితెరపై రాణించడం లాంటివి చేస్తూ ఉంటారు.

 Anchors Turns Tollywood Actors Anasuya Suma Rashmi Regina Details, Tollywood, Anchors, Heroines, Niharika Konidela, Regina Kassandra, Vishnu Priya, Udaya Bhanu, Rashmi Gautham, Anasuya Bharadwaj, Colors Swathi-TeluguStop.com

మరికొన్నిసార్లు బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన వారు ఏకంగా వెండితెరపై మంచి మంచి అవకాశాలను అందు కుంటూ ఉంటారు.ముఖ్యంగా తమ వాక్చాతుర్యంతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న యాంకర్లు అటు వెండి తెరపై హీరోయిన్ లుగా మారిన వారు చాలా మంది ఉన్నారు.ఇక అలాంటి వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

సుమ కనకాల :

బుల్లితెరపై యాంకర్ గా  ఈమెకు తిరుగులేదు.అయితే సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన సుమ కనకాల ఆ తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పేసి యాంకర్ గా అవతారమెత్తింది.ఒక రకంగా ప్రస్తుతం బుల్లితెరపై మకుటంలేని మహారాణి లా నెంబర్ వన్ యాంకర్‌గా ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతోంది సుమ.ఇటీవలే జయమ్మ పంచాయతీ అనే సినిమాతో మరోసారి వెండితెరపై ప్రధాన పాత్రలో నటిస్తోంది సుమ కనకాల.

 Anchors Turns Tollywood Actors Anasuya Suma Rashmi Regina Details, Tollywood, Anchors, Heroines, Niharika Konidela, Regina Kassandra, Vishnu Priya, Udaya Bhanu, Rashmi Gautham, Anasuya Bharadwaj, Colors Swathi-టాలీవుడ్ లో యాంకర్లుగా వచ్చి.. హీరోయిన్ లుగా మారిన వారు వీళ్లే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అనసూయ భరద్వాజ్ :

ఈమెని యాంకర్ అనాలా.యాక్టర్ అనాలా.హీరోయిన్ అనాలా లేకపోతే విలన్ అనాలా అర్థం కాని పరిస్థితి నెలకొంది నేటి రోజుల్లో ప్రేక్షకులకి.జబర్దస్త్ కార్యక్రమం తో యాంకర్ గా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన అనసూయ ఇక ఇప్పుడు వెండితెరపై ఎన్నో విభిన్నమైన పాత్రలతో అద్భుతంగా రాణిస్తోంది.

రష్మి గౌతమ్ :

బుల్లితెర పైనే కాదు వెండితెర పైన ఈ అమ్మడికి అదృష్టం బాగా కలిసొచ్చింది.బుల్లితెరపై జబర్దస్త్ లో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.ఇక వెండితెరపై మాత్రం గుంటూరు టాకీస్ సినిమాలో గ్లామర్ తో అందరికీ పిచ్చెక్కించింది.ఇక ఇప్పుడు చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళాశంకర్ సినిమాలో ఐటమ్ సాంగ్ లో నటించేందుకు సిద్ధమైంది.

శ్రీముఖి :

అద్భుతమైన వాక్చాతుర్యం కు  శ్రీముఖి కేరాఫ్ అడ్రస్.ప్రస్తుతం బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న శ్రీముఖి అదే సమయంలో వెండితెరపై కూడా వరుస అవకాశాలు అందుకుంటోంది.కొన్ని చిన్న చిన్న సినిమాల్లో హీరోయిన్ గా కూడా చాన్స్ కొట్టేసింది ఈ యాంకరమ్మ.

కలర్స్ స్వాతి :

కలర్స్ అనే కార్యక్రమం ద్వారా యాంకర్ గా ఎంతగానో గుర్తింపు సంపాదించుకుంది స్వాతి.యాంకర్ గా గుర్తింపు వచ్చిన కొన్ని రోజుల్లోనే సినిమాల్లో హీరోయిన్ గా  ఛాన్స్ కొట్టేసింది.అష్టా చమ్మా సినిమాతో హీరోయిన్గా అవతారమెత్తిన స్వాతి ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది.

రెజీనా కసాండ్రా :

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ హీరోయిన్ గా కొనసాగుతుంది రెజీనా.అయితే ఈ అమ్మడు కూడా మొదట్లో యాంకరింగ్‌లో రాణించి ఆ తర్వాత ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినట్లు తెలుస్తుంది.తమిళంలో ఒక టీవీ ఛానల్ లో యాంకర్ గా పనిచేసిన రెజినా ఆ తర్వాత హీరోయిన్గా అవకాశాలు దక్కించుకుంది.

నిహారిక కొణిదెల :

ఈటీవీ లో ప్రసారమయ్యే డాన్స్ రియాల్టీ షో ఢీ అనే కార్యక్రమంలో యాంకర్ గా తన వాక్చాతుర్యంతో ఆకట్టుకున్న మెగా డాటర్ నిహారిక… ఆ తర్వాత హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది.ఇప్పుడు నటనకు దూరంగా ఉంటూ నిర్మాతగా అవతారమెత్తింది.

వీళ్లు మాత్రమే కాదు విష్ణుప్రియ, ఉదయభాను లాంటి యాంకర్లు కూడా యాంకర్ గా సత్తా చాటుతూ ఇక సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుని ప్రేక్షకులను అలరించారు.

Anchors Turned into Tollywood Actresses Telugu Anchors

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube