సుధీర్ హర్ట్ అయ్యాడంటున్న విష్ణుప్రియ.. ఏం జరిగిందంటే..?  

జబర్దస్త్ షో ద్వారా తక్కువ సమయంలోనే కమెడియన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు సుడిగాలి సుధీర్.ఈ షోతో పాటు ఢీ చాంపియన్స్ షోలో, పలు ఈవెంట్లలో కనిపిస్తూ సుధీర్ బుల్లితెరపై సత్తా చాటుతున్నారు.

TeluguStop.com - Anchor Vishnupriya Sensational Comments About Sudigali Sudheer

మరోవైపు వెండితెరపై హీరోగా వరుస అవకాశాలతో సుధీర్ బిజీగా ఉన్నారు.అయితే సుధీర్ చెక్ మేట్ సినిమా ట్రైలర్ చూసి హర్ట్ అయ్యారని విష్ణుప్రియ కామెంట్లు చేశారు.

తెలుగులో ఫిమేల్ యాంకర్లలో ఒకరైన విష్ణుప్రియ ప్రస్తుతం చెక్ మేట్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు.చాలా సంవత్సరాల క్రితమే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనా వివిధ కారణాల వల్ల ఈ సినిమా విడుదల అంతకంతకూ ఆలస్యమవుతోంది.

TeluguStop.com - సుధీర్ హర్ట్ అయ్యాడంటున్న విష్ణుప్రియ.. ఏం జరిగిందంటే..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

టీవీ షోలలో పద్దతిగా కనిపించే విష్ణుప్రియ చెక్ మేట్ సినిమాలో మాత్రం గ్లామరస్ గా కనిపించారు.చెక్ మేట్ సినిమాలో విష్ణుప్రియ బికినీ వేయడంతో పాటు లిప్ లాక్ సీన్స్ లో కూడా నటించారు.

Telugu Check Mate Movie, Movie Promotions, Sudigali Sudheer, Vishnupriya Sensational Comments-Latest News - Telugu

స్కిన్ షో ద్వారా సినిమా ఇండస్ట్రీలో మరిన్ని అవకాశాలను సంపాదించాలని విష్ణుప్రియ భావిస్తున్నారు.ఇప్పటికే చెక్ మేట్ ట్రైలర్ విడుదల కాగా ట్రైలర్ లో విష్ణుప్రియ స్కిన్ షోను చూసి ప్రేక్షకులు అవాక్కయ్యారు.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విష్ణుప్రియ సుధీర్ గురించి మాట్లాడుతూ చెక్ మేట్ సినిమాలో హీరో ఫ్రెండ్ పాత్రలో సుధీర్ నటించాడని.అయితే సుధీర్ కు ట్రైలర్ లో ప్రాధాన్యత దక్కకపోవడంతో ఫీల్ అయ్యాడని చెప్పుకొచ్చారు.

ఒకే సినిమాలో నటించినా తను, సుధీర్ ఈ సినిమాలో కలిసి కనిపించలేదని తెలిపారు.

సుధీర్ సినిమాలను చూసి తాను ఎప్పుడూ ఫీల్ కాలేదని అయితే సుధీర్ మాత్రం పర్సనల్ గా తీసుకుని హర్ట్ అయ్యాడంటూ విష్ణుప్రియ కామెంట్లు చేశారు.

తాను సుధీర్ హీరోగా నటించిన సినిమాలు విడుదలైన సమయంలో మనస్పూరిగా అభినందించానని విష్ణుప్రియ వెల్లడించారు.విష్ణుప్రియ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

Anchor Vishnupriya Sensational Comments About Sudigali Sudheer Related Telugu News,Photos/Pics,Images..