ఆ హీరోలాంటి భర్త కావాలంటున్న విష్ణుప్రియ.. ఎవరంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది యాంకర్లు తమకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు వరుస ఆఫర్లతో బిజీ అవుతున్నారు.ఫిమేల్ యంకర్స్ లో సుమ, అనసూయ, రష్మీలతో పాటు విష్ణుప్రియ కూడా మంచిపేరును సొంతం చేసుకున్నారు.

 Vishnupriya Comments About Her Husband Qualities, Aditya Rai Kapoor, Anchor Vish-TeluguStop.com

సుడిగాలి సుధీర్ తో కలిసి చేసిన షోలు విష్ణుప్రియకు యాంకర్ గా మంచి పేరు తెచ్చిపెట్టాయి.విష్ణుప్రియ నటించిన చెక్ మేట్ సినిమా విడుదలై సక్సెస్ సాధిస్తే నటిగా కూడా విష్ణుప్రియ బిజీ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

పోవే పోరా షోతో పాటు విష్ణుప్రియ మరికొన్ని షోలు కూడా చేశారు.వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను విష్ణుప్రియ అంతకంతకూ పెంచుకుంటున్నారు.

స్కిన్ షో కూడా చేస్తూ గ్లామర్ రోల్స్ లో కూడా అవకాశాలు వస్తే సత్తా చాటుతామని విష్ణుప్రియ చెప్పకనే చెబుతున్నారు.విష్ణుప్రియకు సంబంధించిన హాట్ ఫొటోషూట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Telugu Aasiqui, Anasuya, Rashmi, Tollywood, Tv Shows, Vishnupriya-Movie

తాజాగా అభిమానులతో ముచ్చటించిన ఈ బ్యూటీ తనకు కాబోయే భర్త గురించి, ఇతర విషయాల గురించి చెప్పుకొచ్చారు.తనకు ఆషికి2 సినిమాలో హీరోగా నటించిన ఆదిత్య రాయ్ కపూర్ లా ఉండే వ్యక్తి భర్తగా కావాలని ఆమె చెప్పుకొచ్చారు.ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో అయినా ఇలాంటి భర్తను ఇవ్వాలని ఆమె దేవుడిని కోరారు.ఆమె చేసిన కామెంట్ కు నెటిజన్లు తథాస్తు అని కామెంట్లు పెట్టడం గమనార్హం.

Telugu Aasiqui, Anasuya, Rashmi, Tollywood, Tv Shows, Vishnupriya-Movie

మరి కొందరు నెటిజన్లు ఏకంగా వచ్చే జన్మ వరకు ఆగాల్సిన అవసరం లేదని ఈ జన్మలోనే అలాంటి భర్త వస్తారని కామెంట్లు చేస్తున్నారు.చెక్ మేట్ తో హీరోయిన్ గా సక్సెస్ సాధిస్తే విష్ణుప్రియ బుల్లితెర కంటే వెండితెరకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube