యాంకరింగ్ పక్కన పెట్టి డిజిటల్, మూవీస్ పై ఫోకస్ పెట్టిన విష్ణుప్రియ

ఈ మధ్యకాలంలో టెలివిజన్ పై యాంకర్స్ కూడా హాట్ హాట్ ఫోటో షూట్ లతో రెచ్చిపోతూ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కి వినోదాన్ని అందిస్తున్నారు.యాక్టర్స్ గా కెరియర్ స్టార్ట్ చేసిన తమ గ్లామర్ తో హాట్ యాంకర్స్ అనే గుర్తింపుని క్రియేట్ చేసుకున్నారు.

 Anchor Vishnu Priya Plan To Digital Entry, Tollywood, Telugu Beauties, Anchor Vi-TeluguStop.com

ఈ జాబితాలో జబర్దస్త్ యాంకర్స్ అనసూయ, రష్మి, శ్రీముఖి ముందు వరుసలో ఉంటే వారిని ఫాలో అవుతూ వర్షిణీ, విష్ణుప్రియ లాంటి వారు కూడా వస్తున్నారు.అలాగే కొత్త కొత్త మోడల్స్ యాంకర్స్ గా అవతారం ఎత్తుతున్నారు.

ఇదిలా ఉంటే యాంకర్ విష్ణుప్రియ ఈ మధ్య షోలని పూర్తిగా పక్కన పెట్టి నటిగా ఎస్టాబ్లిష్ అయ్యేందుకు ప్రయత్నాలు విస్తృతం చేస్తుంది.

దీనికోసం తనలోని గ్లామర్ ని బయటకి తీసుకొస్తూ రెగ్యులర్ గా హాట్ ఫోటోషూట్ లతో సందడి చేస్తుంది.

ఇదిలా ఉంటే ఈ బ్యూటీ ప్రస్తుతం సినిమాల ప్రయత్నాలు మొదలు పెట్టింది.అలాగే డిజిటల్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది.ఈ నేపధ్యంలో యాంకర్ గా అవకాశాలు వచ్చిన కూడా వాటిని పూర్తిగా పక్కన పెట్టినట్లు తెలుస్తుంది.రీసెంట్ గా డిజిటల్ ఎంట్రీ కూడా విష్ణుప్రియ ఖరారు చేసుకుందని టాక్ వినిపిస్తుంది.

ఈ నేపధ్యంలోనే ఆమె గ్లామర్ షోకి తెరతీసినట్లు ప్రచారం జరుగుతుంది.మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే అధికారికంగా కన్ఫర్మ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.

మొత్తానికి షార్ట్ ఫిల్మ్ తో కెరియర్ స్టార్ట్ చేసి యాంకర్ గా మారిన ఈ బ్యూటీ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్, డిజిటల్ ఫ్లాట్ ఫామ్ పై నటిగా ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నాలు విస్తృతం చేసిందని మాత్రం తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube