ఆ యాంకర్ కాలికి గాయం.. అయితే ఆమె ఏం చెబుతుందో తెలుసా...?

తెలుగు బుల్లితెర పై తనదైన శైలిలో అందిరిని ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న యాంకర్ విష్ణు ప్రియ.విష్ణు ప్రియ గొంతు, ముక్కు, ఆమె పై వేసే సెటైర్లతోనే ఆవిడ బాగా ఫేమస్ అయిపోయింది.ఈటీవీ ప్లస్ లో ప్రసారమయ్యే పోరా పోవే.షో లో సుడిగాలి సుధీర్ తో కలిసి చేసే షో ఆమెకు మంచి పేరును తీసుకువచ్చింది.యాంకరింగ్ లోకి రాకముందు విష్ణుప్రియ యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ లో నటించేది.అయితే బుల్లితెర మీద తన చేసే అల్లరి తోనే తనకు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది.

 Anchor Vishnu Priya Leg Injured, Instagram Story, Vishnu Priya, Small Screen, Le-TeluguStop.com

బుల్లితెర లోకి అడుగుపెట్టిన విష్ణు ప్రియ కొద్ది కాలంలోనే శ్రీముఖి తో కలిసి పోవడం, వారిద్దరూ మంచి స్నేహితులుగా మారిపోవడంతో ఇద్దరూ కలిసి సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేసేవారు.వీళ్లిద్దరు చేసే అల్లరి అంత ఇంతా కాదు.

అసలు విషయంలోకి వెళితే… తాజాగా యాంకర్ విష్ణు ప్రియ కాలికి గాయం అయిందని తానే స్వయంగా చెప్పుకొచ్చింది.అయితే తనకు ఈ గాయాల అంటే చాలా ఇష్టమని.

ఓ థియరీ ని చెప్పింది.అదేమిటంటే ఇలాంటి గాయాలు కావడం అంటే తనకు చాలా ఇష్టమని, ఐ లవ్ యు దెబ్బలు… అవన్నీ నా ఒంటిపై ఎక్స్ ట్రా సామాన్లు… ఇలాంటి గాయాల వల్ల నా జీవిత ప్రయాణంలో రోడ్లు ఎలా ఉన్నాయో అంటూ చెప్పుకొచ్చింది.

అంతేకాదు ప్రస్తుతం ఈ గాయం తగ్గుతోంది అంటూ చెప్పుకొచ్చింది.ఈ దెబ్బ తగిలి 8 రోజులు అయ్యిందని, అయినా కానీ నడవడానికి చాలా ఇబ్బందిగా ఉందంటూ తెలియజేసింది.

అయితే ఇప్పుడిప్పుడే తాను కాస్త కోలుకుంటున్నట్లు తెలిపింది.ఈ విషయాన్ని తాను అందరితో పంచుకోవాలని అనుకుంటున్నట్లు అలా చేస్తే మీ అందరి ప్రేమ తనకు దక్కుతుందని… ఇదే బ్యూటీ ఆఫ్ దెబ్బలు అంటూ తెలుపుతూనే… ఇలా దెబ్బలు తగిలినప్పుడు మరింత ఎక్కువగా బుజ్జగింపులు దొరుకుతాయని విష్ణు ప్రియ తన సీక్రెట్ థియరీ ని బయటకు చెప్పింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube