తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ వర్షిని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె బుల్లితెరపై ప్రసారమయ్యే పలు రకాల షోలలో యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో మంది ప్రేక్షకుల మనసులలో స్థానం సంపాదించుకుంది.
అంతేకాకుండా సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.ఇక వర్షిని అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్ లతో కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది.
పటాస్ 2 షో ద్వారా యాంకర్ గా రీ ఎంట్రీ ఇచ్చింది.ఒకవైపు బుల్లితెరపై ప్రసారమయ్యే షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూనే, మరొకవైపు వెబ్ సీరిస్ లో కూడా నటిస్తూ బిజీ బిజీగా ఉంది.
తెలుగు ప్రేక్షకులలో వర్షినికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఇదిలా ఉంటే ప్రస్తుతం మరొక 30 నిమిషాలలో యాంకర్ వర్షిని పెళ్లి అంటూ మాట వినిపిస్తోంది.
అసలేం జరిగిందంటే.తాజాగా వర్షిని ఇంస్టాగ్రామ్ లో ఒక యాప్ చూస్తున్నపుడు పెళ్లికి సంబంధించిన ప్రశ్న వచ్చింది.
నాకు పెళ్లి ఎప్పుడు అవుతుంది? అనే ప్రశ్న ఇన్ స్టాల్ రీల్ వచ్చింది.ఇంకో అరగంటలో అనే సమాధానం రావడంతో యాంకర్ వర్షిని షాక్ అయ్యింది.ఇదేంటి అన్నట్టుగా ఒక్కసారిగా అవాక్కయ్యింది.ఈ విషయంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.ఒక నెటిజన్ నేను రెడీ? అని కామెంట్ చేయగా మరొక నెటిజన్ ఎక్కడికి రావాలో చెప్పు?అంటూ కామెంట్లు చేశారు.అలాగే సోషల్ మీడియాలో ప్రస్తుతం వర్షిని పెళ్లి మీద చర్చలు జరుగుతున్నాయి.