కొంచమైనా సిగ్గుండాలి ఆది అంటూ పరువు తీసిన వర్షిణి!

బుల్లితెర జోడీల్లో రష్మీ సుధీర్ తరువాత ఆ రేంజ్ లో పాపులారిటీని సంపాదించుకున్నారు హైపర్ ఆది వర్షిణి.సుధీర్ రష్మీలా వీళ్లిద్దరి వర్షిణి మధ్య ఏదో ఉందనే కామెంట్లు వినిపించకపోయినా ఆది వర్షిణి కెమిస్ట్రీ బాగుంటుందని ఒకరిపై ఒకరు వేసుకునే పంచ్ లు బాగుంటాయని ప్రేక్షకులు అభిప్రాయపడుతుంటారు.

 Anchor Varshini Satires On Hyper Aadi In Dhee Champions Show, Dhee Champions, Hy-TeluguStop.com

హైపర్ ఆది వర్షిణి టీం లీడర్లుగా వ్యవహరించే ఢీ ఛాంపియన్స్ ప్రోమో తాజాగా విడుదలైంది.

ఈ ప్రోమోలో వర్షిణి ఆది ఒకరిపై ఒకరు వేసుకుంటున్న పంచ్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మొదట “నా ప్రేమను కోపంగానో నా ప్రేమను ద్వేషంగానో” పాటతో హైపర్ ఆది, వర్షిణి ఎంట్రీ ఇచ్చారు.ఆది ప్రదీప్ తో తాను కలిసి రావాలని వర్షిణికి ముందుగానే చెప్పానని ఆవిడ అటునుంచి నేను ఇటునుంచి వస్తే వర్షిణి తనకు ఎప్పుడు పడుతుందని అని అడుగుతాడు.

వెంటనే ప్రదీప్ వర్షిణి కన్ఫామ్ గా నీకే పడుతుందంటూ ఆదికి చెబుతాడు.

ఆది ప్రదీప్ ను ఎలా పడుతుందని అడగగా ఫస్ట్ ముక్కులోంచి తరువాత నోట్లోంచి పడుతుందని చెబుతాడు.

ఆ తరువాత హైపర్ ఆది నా ముందు నువ్వు తగ్గి ఉండాలి.నా దగ్గరకు వచ్చాక ఒక హగ్గు ఉండాలి అని చెప్పగా వర్షిణి మనిషన్నాక కొంచమైనా సిగ్గుండాలి అని అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది.

వర్షిణి నాలాంటి ప్రిన్సెస్ కు ప్రిన్స్ లా ఉండాలని నా లాంటి క్వీన్ కు కింగ్ లా ఉండాలని అనగా ఆది మీరెప్పుడూ ఇలానే నవ్విస్తూ ఉండాలని వర్షిణికి షేక్ హ్యాండ్ ఇస్తాడు.
ప్రతివారం ఢీషోలో వర్షిణి హైపర్ ఆది ఒకరిపై ఒకరు వేసుకునే పంచ్ లు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాయి.

రష్మీ సుధీర్ అంత కాకపోయినా ఈ జోడీకి కూడా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube