వాట్సాప్ చాట్ లీక్ చేసిన వర్షిణి.. అవాక్కైన రవి..?

బుల్లితెర యాంకర్లుగా యాంకర్ రవి, వర్షిణి తమకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న సంగతి తెలిసిందే.రవి జీ తెలుగు ఛానల్ లో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ షోతో పాటు పలు ఈవెంట్లలో సందడి చేస్తుండగా వర్షిణి ఢీ షోకు దూరమైన తరువాత స్టార్ మా ఛానల్ లో కామెడీ స్టార్స్ అనే ప్రోగ్రామ్ తో బిజీగా ఉన్నారు.

 Anchor Varshini Leaks Ravi Whatsapp Chat In Instagram-TeluguStop.com

గతంలో రవి, వర్షిణి కలిసి కొన్ని రోజుల పాటు పటాస్ షో కలిసి చేసిన సంగతి తెలిసిందే.

గతంలో రవి సొంత యూట్యూబ్ ఛానల్ లో వర్షిణి, ఆమె అక్కతో కలిసి ఒక వీడియో కూడా చేసిన సంగతి తెలిసిందే.

 Anchor Varshini Leaks Ravi Whatsapp Chat In Instagram-వాట్సాప్ చాట్ లీక్ చేసిన వర్షిణి.. అవాక్కైన రవి..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే తాజాగా వర్షిణి రవితో చేసిన చాట్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఆ మెసేజ్ లో రవి హై హీల్స్ వేసుకోవద్దని వర్షిణికి మెసేజ్ చేశారు.

ఆ తరువాత వర్షిణి ఇన్ స్టాలో పెడతా ఆ మెసేజ్ ను అని చెప్పింది.ఆ తరువాత ఇన్ స్టాలో పొట్టివాళ్ల కష్టాలు అంటూ వర్షిణి చాట్ ను లీక్ చేసింది.

Telugu Anchor Ravi, Anchor Varshini, Chat, Dhee, Family Friends, High Heels, Instagram, Instagram Account, Leaks, Pataas, Patas Show, Varshini, Whatsapp, Whatsapp Chat-Movie

వర్షిణి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.తను పొట్టిగా ఉండటం వల్లే హై హీల్స్ వేసుకుంటున్నట్టు వర్షిణి చెప్పకనే చెప్పేసింది.అయితే వర్షిణి, రవి ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాబట్టి సరదాగా ఇలా చాట్ చేసుకోవడం సాధారణమే అని చెప్పాలి.మరోవైపు యాంకర్ రవి పటాస్ షోకు దూరమైన తరువాత యాంకర్ గా గతంతో పోలిస్తే అవకాశాలు తగ్గాయి.

బొమ్మ అదిరింది షోకు కొంతకాలం యాంకర్ గా చేసిన రవి ఆ తరువాత ఆ షోకు కూడా దూరమయ్యారు.

కెరీర్ పరంగా రవికి అవకాశాలు తగ్గినా రవి చేసిన ఒక్క షో హిట్టైతే మాత్రం మళ్లీ యాంకర్ గా బిజీ అయ్యే అవకాశం ఉంది.

మరోవైపు వర్షిణి ఢీ షోకు దూరమైన తరువాత ఆమె స్థానంలో దీపికా పిల్లి వచ్చారు.అయితే వర్షిణిని ఢీ షో నుంచి ఎందుకు తప్పించారో తెలియాల్సి ఉంది.

#Anchor Ravi #Leaks #Anchor Varshini #Dhee #Whatsapp Chat

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు