యాంకర్ రవితో జోడీ కట్టిన మరో హాట్ యాంకర్! పటాస్ కి కొత్త కళ  

పటాస్ యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన వర్షిణి. .

Anchor Varshini Enter In Patas Comedy Show With Ravi Combination-

ఈ మద్యంలో సినిమాలతో సమానంగా తెలుగు టెలివిజన్ లో కూడా యాంకర్స్ తమ హాట్ అందాలతో అందరికి దగ్గర అవుతున్నారు. జబర్దస్త్ షోతో మొదటిగా సందడి చేసి అనసూయ కాస్తా హాట్, గ్లామర్ తో యాంకరింగ్ కి కొత్త కళ తీసుకొచ్చింది. ఇక ఆమె తర్వాత రష్మి తన హాట్ అందాలతో టెలివిజన్ లో మరింత హాట్ నెస్ పెంచి యాంకర్ కి మాటలతో పాటు కాస్తా అందం జనాలని ఆకర్షించే లుక్స్ ఉండాల్సిందే అనే విధంగా టెలివిజన్ రియాలిటీ షో లలో తమ హవా మొదలెట్టారు..

యాంకర్ రవితో జోడీ కట్టిన మరో హాట్ యాంకర్! పటాస్ కి కొత్త కళ -Anchor Varshini Enter In Patas Comedy Show With Ravi Combination

ఇక వీరి దారిలో నటిగా ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి యాంకర్ అవతారం ఎత్తింది. అలాగే నటిగా అడుగులు వేసిన వర్షిణి కూడా యాంకర్ అయిపొయింది. ఇలా తెలుగు టెలివిజన్ షోలు ఇప్పుడు హాట్ యాంకర్స్ తో ఫుల్ సందడి చేస్తుంది.

చాలా మంది సీరియల్ హీరోయిన్స్ కూడా తమ గ్లామర్ కి కాస్తా మాటలు జోడించి యాంకర్ గా రాణించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే టెలివిజన్ రియాలిటీ షోలలో జబర్దస్త్ తర్వాత భాగా పాపులర్ అయిన కామెడీ షో పటాస్, దీనిని మొన్నటి వరకు రవి, శ్రీముఖి నడిపించేవారు. అయితే ఇద్దరి మధ్య మళ్ళీ ఏమయ్యిందో తెలియదు కాని పటాస్ షో నుంచి ఆమె తప్పుకుంది.

దీంతో ఆమె ప్లేస్ కొత్త యాంకర్ గా హాట్ బ్యూటీ వర్షిణిని ఎంపిక చేసారు. తాజాగా ఎపిసోడ్స్ లో వర్షిణీ రవితో కలిసి సందడి చేసింది. అయితే శ్రీముఖి అంత హైపర్ లేకపోవడంతో వర్షిణి పటాస్ షోకి ఆకర్షణగా మారలేదని టాక్ వినిపిస్తుంది.

కాని గ్లామర్ తో మాత్రం శ్రీముఖి కంటే బెటర్ ఆప్షన్ అని మాత్రం చెప్పుకుంటున్నారు,