సుమంత్ కు భార్యగా యాంకర్ వర్షిణి.. నిజమేంటంటే?

హీరో సుమంత్ రెండోసారి పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ గత రెండురోజుల క్రితం నుంచి పెద్ద ఎత్తున వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.తన మొదటి భార్య హీరోయిన్ కీర్తి రెడ్డికి విడాకులు ఇచ్చిన సుమంత్ రెండవ సారి పెళ్లి చేసుకోబోతున్నారని అతని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు పవిత్ర అంటూ ఒక వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.

 Anchor Varshini As Sumants Wife Really-TeluguStop.com

అయితే పెళ్లి విషయంపై హీరో సుమంత్ స్పందించి అసలు విషయం బయట పెట్టారు.

హీరో సుమంత్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు పవిత్ర కాదు.

 Anchor Varshini As Sumants Wife Really-సుమంత్ కు భార్యగా యాంకర్ వర్షిణి.. నిజమేంటంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

యాంకర్ వర్షిణి.అవును మీరు విన్నది నిజమే.

అయితే ఇది రియల్ లైఫ్ లో మాత్రం కాదు కేవలం రీల్ లైఫ్ లో మాత్రమే.హీరో సుమంత్ యాంకర్ వర్షిణి వెండితెరపై ఓ సినిమాలో భార్యాభర్తలుగా నటించనున్నారు.

ప్రస్తుతం సుమంత్ హీరోగా “మళ్ళీ మొదలైంది” అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా పెళ్లి, విడాకుల తర్వాత జీవితం ఎలా ఉంటుంది అనే కథాంశంతో తెరకెక్కుతుంది.

Telugu Anchor, Malli Modalaindi Movie, Marrige, Saina Ganguly, Sumanth, Sumanth Second Marriage, Varini, Varshini Movie Offers-Movie

ఈ క్రమంలోనే ఈ సినిమాలో సుమంత్ సరసన హీరోయిన్ గా నైనా గంగూలీ నటిస్తున్నారు.ఈమెతో పాటు బుల్లితెర యాంకర్ వర్షిణి కూడా సుమంత్ భార్య పాత్రలో నటిస్తున్నారు.ఇక వర్షిణి బుల్లితెరపై యాంకర్ గా చేస్తూ ఎంతో ఆదరణ దక్కించుకుంది.ఈ క్రమంలోనే వెండితెరపై పలు అవకాశాలు దక్కించుకుంటూ కెరియర్ లో ముందుకు వెళ్తున్నారు.ప్రస్తుతం వర్షిని సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్నటు వంటి “శాకుంతలం“, సుమంత్ “మళ్ళీ మొదలైంది” సినిమాలో నటిస్తున్నారు.ఈ రెండు సినిమాలు కూడా అక్కినేని కుటుంబానికి చెందినవి కావడం విశేషం.

#Sumanth #Varshini Offers #Varini #Anchor #Sumanth

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు