మా బాలయ్య బంగారం అంటున్నయాంకర్ ఉదయభాను  

Anchor Udayabhanu Wishes To Balakrishna - Telugu, Jr Ntr, Nandamuri Fans, Telugu Cinema, Tollywood

టాలీవుడ్ లో గత కొద్ది రోజులుగా నందమూరి బాలకృష్ణ చిరంజీవి పైన, కేసీఆర్ తో టాలీవుడ్ కి చెందిన కొంత మంది కలవడంపై సంచలన వాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.ఈ వ్యవహారంతో ఇండస్ట్రీలో రెండు వర్గాలు ఉన్నాయని బహిరంగంగా వాఖ్యలు వినిపిస్తున్నాయి.

 Anchor Udayabhanu Wishes To Balakrishna

అయితే కొంత మంది బాలకృష్ణ వాఖ్యలని సమర్ధిస్తూ ఉండగా, కొంతమంది చిరంజీవికి మద్దతుగా నిలబడ్డారు.ఈ వ్యవహారం అంతా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య వెర్బల్ వార్ కి కారణం అవుతుంది.

చాలా మంది బాలక్రిష్ణని ట్రోల్ చేస్తున్నారు.ఇంతలో బాలకృష్ణ పుట్టినరోజు దగ్గర పడుతుంది.

మా బాలయ్య బంగారం అంటున్నయాంకర్ ఉదయభాను-Movie-Telugu Tollywood Photo Image

ఈ పుట్టినరోజుని ఘనంగా జరపడం ద్వారా టాలీవుడ్ లో బాలకృష్ణ స్టామినా ఏంటో చూపించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఈ నేపధ్యంలో జూన్ 10న నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో ముందుగానే సంబరాలు మొదలయ్యాయి.

బాలయ్యకు ముందస్తుగా అనేకమంది విషెస్ తెలియజేస్తున్నారు.ప్రముఖ యాంకర్ ఉదయభాను కూడా బాలకృష్ణ పుట్టినరోజుపై ట్వీట్ చేశారు.కష్టం ఉందని తెలిస్తే చాలు వెంటనే స్పందిస్తారని, ఎంత పని ఉన్నా పక్కనబెట్టి ఏమీ ఆలోచించకుండా వచ్చేస్తారు మా బాలయ్య అంటూ వ్యాఖ్యానించారు.60 ఇయర్స్ బాలయ్య అంటూ ఓ ఫొటోను కూడా షేర్ చేశారు.మొత్తానికి మా బాలయ్య బాబు బంగారం అంటూ ఉదయభాను చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాతో హాట్ టాపిక్ గా మారాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Anchor Udayabhanu Wishes To Balakrishna Related Telugu News,Photos/Pics,Images..

footer-test