ఈ తెలుగు యాంకర్ కూతుర్లు ఎంత ముద్దుగా ఉన్నారో చూడండి..!

తెలుగులో ఒకప్పుడు బుల్లితెర మీద తన గలగల మాటలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న టాలీవుడ్ బ్యూటిఫుల్ యాంకర్ ఉదయభాను గురించి తెలుగు సినీ ప్రేక్షకులకి పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే యాంకర్ ఉదయభాను పలు షోలు ఈవెంట్లకు వ్యాఖ్యాత గానే కాకుండా పలు టాలీవుడ్ చిత్రాలలో స్పెషల్ సాంగ్స్ లో కూడా నృత్యం చేసి ప్రేక్షకులని బాగానే అలరించింది.

 Anchor Udaybhanu Daughters Photos Viral,udayabhanu, Telugu Anchor, Vijay Kumar,-TeluguStop.com

అయితే 2004 వ సంవత్సరంలో సినిమా పరిశ్రమకు చెందినటువంటి విజయ్ కుమార్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.పెళ్లయిన అనంతరం కూడా ఉదయభాను సినిమాలలో నటించింది.కాగా ప్రస్తుతం ఉదయభాను కి ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. కాగా ఇద్దరి కవల పిల్లలకి యువ నక్షత్ర మరియు భూమి ఆరాధ్య అనే పేర్లతో నామకరణం చేశారు.

అయితే ఇటీవలే వీరిద్దరి పుట్టిన రోజు వేడుకలకి టాలీవుడ్ లెజెండ్ బాలయ్య బాబు అతిథిగా విచ్చేసి ఆశీర్వదించారు.కాగా తాజాగా ఉదయభాను తన భర్త, ఇద్దరు కూతుర్లతో దిగినటువంటి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

 దీంతో కొందరు నెటిజన్లు ఈ ఫోటో పై స్పందిస్తూ ఇద్దరు చిన్నపిల్లలు బుట్ట బొమ్మ లాగా చాలా ముద్దుగా ఉన్నారని అంటూ కామెంట్లు చేస్తున్నారు.

తెలుగులో చివరిగా ఉదయభాను యంగ్  దర్శకుడు రాజా సుదీర్ దర్శకత్వం వహించిన “మధుమతి” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది.

ఆ తర్వాత మళ్లీ ఇప్పటివరకు ఉదయభాను సినిమాలలో నటించలేదు.కాగా ప్రస్తుతం ఉదయభాను హైదరాబాదులో తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube