యాంకర్ శ్యామల గృహప్రవేశం.. ఆమె కొత్త ఇల్లు ఎలా ఉందో చూశారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న లేడీ యాంకర్ లలో యాంకర్ శ్యామల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె ఎన్నో సినిమా ఫంక్షన్లకు ప్రత్యేక కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో మంచి ఆదరణ దక్కించుకున్నారు.

 Anchor Syamala New House Warming Video Goes Viral, Anchor Shyamala, New House Wa-TeluguStop.com

కెరియర్ మొదట్లో పలు సీరియల్స్ లో నటించిన శ్యామల అనంతరం యాంకర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.అదే విధంగా పలు సినిమాలలో కూడా ఓ కీలక పాత్రలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ఏకంగా బిగ్ బాస్ అవకాశాన్ని కూడా దక్కించుకున్నారు.

ఇలా బిగ్ బాస్ ద్వారా మరింత గుర్తింపు పొందిన శ్యామల తాజాగా ఒక ఖరీదైన విల్లాను నిర్మించిన సంగతి మనకు తెలిసిందే.అయితే గత కొద్ది రోజుల క్రితం శ్యామల నూతన గృహప్రవేశం చేసిన సంగతి మనకు తెలిసిందే .ఈ క్రమంలోనే ఆ గృహ ప్రవేశానికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.అదే విధంగా తన హోమ్ టూర్ ద్వారా తన ఇంటిని మొత్తం శ్యామల యూట్యూబ్ ఛానల్ ద్వారా చూపించారు.

శ్యామల ఇల్లు మొత్తం పాల రాతితో నిర్మితమై చూడటానికి ఇంద్ర భవనాని తలపించెలా ఉందని చెప్పవచ్చు.ఇదిలా ఉండగా తాజాగా శ్యామల యూట్యూబ్ ఛానల్ ద్వారా తన గృహ ప్రవేశానికి సంబంధించిన వీడియోని పోస్ట్ చేశారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇకపోతే యాంకర్ శ్యామల గృహప్రవేశానికి అలీ దంపతులు, యాంకర్ సుమ దంపతులు, గీతా మాధురి, తనీష్ వంటి పలువురు హాజరైనట్లు తెలుస్తోంది.

ఇక శ్యామల షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది ఈ వీడియోపై విమర్శలు చేయగా మరికొందరు తనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube