బిగ్ బాస్ సీక్రెట్ బయట పెట్టిన ఆ యాంకర్! బాస్ ని ఇంప్రెస్ చేయాలంటా  

Anchor Swetha Reddy Sensational Comments On Big Boss-big Boss,big Boss Session 3,king Nagarjuna,star Maa

తెలుగునాట బిగ్ బాస్ సీజన్ 3 ఇంకా మొదలు కావడానికి ముందే వివాదాలకి కేంద్ర బిందువుగా మారుతుంది. బిగ్ బాస్ చరిత్రలో ఇప్పటి వరకు ఈ భాషలో రానటువంటి నెగిటివ్ కామెంట్స్ తాజాగా తెలుగు బిగ్ బాస్ మీద వస్తున్నాయి. బిగ్ బాస్ షో అందరూ అనుకున్నట్లు జరగడం లేదని, దాని వెనుక చాలా పెద్ద కథ నడుస్తుందని తాజాగా కొంత మంది భామలు చెప్పుకొచ్చారు. ఇప్పటికే అప్పట్లో నటి మాధవీలత బిగ్ బాస్ మీద సంచలన వాఖ్యలు చేసింది..

బిగ్ బాస్ సీక్రెట్ బయట పెట్టిన ఆ యాంకర్! బాస్ ని ఇంప్రెస్ చేయాలంటా-Anchor Swetha Reddy Sensational Comments On Big Boss

బిగ్ బాస్ ముసుగులో కాస్టింగ్ కౌచ్ నడుస్తుందని చెప్పింది. నిర్వాహకులు ఫోన్ చేసి బాస్ ని ఇంప్రెస్ చేయడానికి మీరు ఏం చేస్తారు అని డైరెక్ట్ గా డీల్ మాట్లాడుతున్నారు అంటూ చెప్పుకొచ్చింది.

తాజాగా యాంకర్ గా పాపులర్ అయిన శ్వేతా రెడ్డి కూడా బిగ్ బాస్ ముసుగులో కాస్టింగ్ కౌచ్ వ్యవహారం నడుస్తుందని సంచలన నిజాలు బయట పెట్టింది.

బిగ్ బాస్ నిర్వాహకులు తనకి ఫోన్ చేసి బిగ్ బాస్ కోసం మిమ్మల్ని ఎంపిక చేస్తున్నాం అని ముందు చెప్పారని, తరువాత తన నుంచి చాలా విషయాలు అడిగి తెలుసుకున్నారని ఇక బిగ్ బాస్ లోకి తన ఎంట్రీ కన్ఫర్మ్ అని అనుకున్న తర్వాత సడెన్ గా వారి నుంచి ఊహించని విధంగా బాస్ ని ఇంప్రెస్ చేయడానికి మీరు ఏం ఇస్తారు అని అడగడంతో షాక్ అయ్యి రివర్స్ అయ్యా అని, దాంతో తనని మరి ఎంపిక చేయకుండా పక్కన పెట్టారని ఓ మీడియా ఇంటర్వ్యూలో సంచలన నిజాలు చెప్పింది. తనలాగే బిగ్ బాస్ బాధితులు కొంత మంది ఉన్నారాని, వారు కూడా మీడియా ముందుకి రావడానికి సిద్ధంగా ఉన్నారని శ్వేతా రెడ్డి చెప్పుకొచ్చింది.