మేకప్ లేకుండా సుమ ఫోటో.. నెట్టింట వైరల్!  

Anchor Suma without makeup photos goes viral in social media, Anchor Suma, Rajeev Kanakala, Without makeup, Social Media, Viral, Suma Viral news - Telugu Anchor Suma, Anchor Suma Without Makeup Photos Goes Viral In Social Media, Cash Show, Rajeev Kanakala, Social Media, Suma Viral News, Suma Without Make Up, Viral, Without Makeup

మన స్టార్ హీరోయిన్లలో, యాంకర్లలో చాలామంది మేకప్ లేకుండా ఫోటో దిగాలంటే గజగజా వణుకుతారు.కొందరు హీరోయిన్లు, యాంకర్లనైతే మేకప్ లేకుండా అస్సలు గుర్తుపట్టలేం.

TeluguStop.com - Anchor Suma Without Makeup Photo Goes Viral In Social Media

గతంలో కొంతమంది స్టార్ హీరోయిన్ల మేకప్ లేని ఫోటోలు విడుదలైన సమయంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్లేంటి.? ఇలా ఉన్నారు అని కామెంట్లు వినిపించాయి.కొందరు హీరోయిన్ల మేకప్ లేని ఫోటోలు సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యాయి.
అయితే స్టార్ యాంకర్ సుమ మాత్రం ఎలాంటి మేకప్ లేకుండా తన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

తన భర్తతో సుమ కలిసి ఉన్న ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.మేకప్ లేకపోయినా సుమ అందంగానే ఉన్నారని.కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తుంటే.మేకప్ లేకుండా ఫోటో పోస్ట్ చేయాలంటే గట్స్ ఉండాలని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు.

TeluguStop.com - మేకప్ లేకుండా సుమ ఫోటో.. నెట్టింట వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

సుమ “ప్రకృతి మరియు జీవితం యొక్క అందం ఒకే ఫోటోలో ఉంది” అనే క్యాప్షన్ తో ఈ ఫోటోను ఫేస్ బుక్ ఖాతాలో షేర్ చేశారు.

ఈ ఫోటోకు 98,000 లైకులు రాగా 1,500 కామెంట్లు వచ్చాయి.

నిజ జీవితంలో చాలా అన్యోన్యంగా ఉండే రాజీవ్ కనకాల, సుమ విడిపోయారని కొన్ని నెలల క్రితం గాసిప్స్ వినిపించాయి.ఇద్దరూ వేర్వేరు ఇళ్లల్లో ఉన్నారని.పరస్పర అంగీకారంతో విడిపోయారని కామెంట్లు వ్యక్తమయ్యాయి.అప్పట్లో సుమ, రాజీవ్ కనకాల ఈ వార్తలపై స్పందించకపోవడంతో ప్రజలు కూడా ఈ వార్త నిజమేనేమో అని భావించారు.

అయితే కొన్ని వారాల క్రితం వీరిద్దరూ కలిసి క్యాష్ అనే షోలో సందడి చేయడంతో అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి.ఆ తరువాత సుమ సోషల్ మీడియాలో భర్తతో అన్యోన్యంగా ఉన్న ఫోటోలను షేర్ చేస్తున్నారు.

ప్రస్తుతం సుమ క్యాష్ ప్రోగ్రామ్ తో పాటు పలు యూట్యూబ్ ఛానళ్లలో వీడియోలు చేస్తున్నారు.

#Social Media #Anchor Suma #Without Makeup #Cash Show #AnchorSuma

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Anchor Suma Without Makeup Photo Goes Viral In Social Media Related Telugu News,Photos/Pics,Images..