త్వరలోనే శుభవార్త చెప్తానంటున్నా యాంకర్ సుమ.. క్యాలెండర్ లో ఆ తేదీలను?

తెలుగు నటి, యాంకర్ సుమ పరిచయం గురించి తెలియని వారేవ్వరు లేరు.తన యాంకరింగ్ తో ఎంతో మంచి పేరు సంపాదించుకున్న సుమ తన మాటలతో వేదిక మొత్తం సందడి చేస్తూ ఉంటుంది.

 Anchor Suma Wants To Tell Good News Soon-TeluguStop.com

ఎన్నో షోలలోనే కాకుండా ఎన్నో సినీ అవార్డు ఫంక్షన్ లలో, ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లలో తన యాంకరింగ్ తో బాగా హంగామా చేస్తుంది.ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది సుమ.

నిజానికి వెండితెరపై పలు సినిమాలలో నటించగా అంత గుర్తింపు తెచ్చుకోలేని సుమ బుల్లితెరపై మాత్రం విపరీతమైన క్రేజ్ నే కాకుండా ఎంతోమంది అభిమానులను కూడా సంపాదించుకుంది.ప్రస్తుతం బుల్లితెరలో పలు షో లతో బిజీ ఉంటుంది.

 Anchor Suma Wants To Tell Good News Soon-త్వరలోనే శుభవార్త చెప్తానంటున్నా యాంకర్ సుమ.. క్యాలెండర్ లో ఆ తేదీలను-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పటికీ తన వయసును కనిపించకుండా మేకప్ తో బాగా కవర్ చేస్తూ ఉంటుంది.నిజానికి సుమ అంటే చాలు ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు అదంతటదే వస్తుంది.

సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక వీడియోతో అందర్నీ తెగ నవ్విస్తుంది.చాలా వరకు ఫన్నీ వీడియోలను షేర్ చేసుకుంటూ వాటికి ఓ మెసేజ్ ను అందిస్తుంది.

ఇక తన షో కి ఎవరైనా గెస్ట్ గా వస్తే చాలు తన మాటలతో తూటాలు పేలుస్తుంది.ప్రతి ఒక్కరిని తన కౌంటర్ తో బాగా రచ్చ చేస్తుంది.

ఇప్పటివరకు ఎటువంటి నెగటివ్ ను కూడా అందుకోలేదు సుమ.

Telugu Calender, Good News, Instagram, Suam Kanakala-Movie

ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ వేదిక ఓ వీడియో షేర్ చేయగా అందులో క్యాలెండర్ ముందు నిల్చొని కొన్ని తేదీలను మారుస్తూ జూలై 1న మార్క్ చేసింది.జూలై 1న అదిరిపోయే ప్రకటన చేస్తానని ఓ వీడియోను అభిమానులతో షేర్ చేసుకుంది.ఇక ఈ వీడియోని చూసిన అభిమానులు ప్రశ్నించకుండా అస్సలు ఉండరని తెలుసు.

దీంతో జూలై 1న ఏముందని ప్రశ్నించగా.కొందరు బిగ్ బాస్ అప్ డేట్ అని, మరికొందరు సుమ చేయబోయే వెబ్ సిరీస్ అని కామెంట్స్ చేయగా మరికొందరు తన తనయుడు రోషన్ సంబంధించిన సినిమా అప్ డేట్ ఏమో అని కామెంట్స్ చేస్తున్నారు.

ఇక మరి జూలై 1న సుమ ఏం ప్రకటన చేస్తుందో చూడాలి.

#Instagram #Suam Kanakala #Calender

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు