సుమపై సెటైర్లు.. అవి విని చేతిలో ఫోన్ విసిరిగొట్టిన యాంకర్!

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బుల్లితెరపై, వెండితెర పై ఏ ఈవెంట్ లో చూసినా సుమ కనకాల పేరే వినిపిస్తూ ఉంటుంది.

 Anchor Suma Throws Away Emmanuel Phone In Cash Show , Suma, Cash Sow, Emmanuel,-TeluguStop.com

ఈవెంట్లలో, షో లలో, ప్రీ రిలీజ్ వేడుకలో ఎక్కడ చూసినా కూడా యాంకర్ సుమ పేరే వినిపిస్తూ ఉంటుంది.సుమ తన యాంకరింగ్ తో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని తన మాటలతో ఆలోచిస్తూ ఉంటుంది.

సుమ యాంకర్ గా వ్యవహరిస్తోంది అంటే చాలు ఆ షోలకు మంచి టీఆర్పీ రేటింగ్స్ వస్తూ ఉంటాయి.అంతేకాకుండా ఎంతో మంది యాంకర్లు వస్తున్నా కూడా యాంకర్ సుమకు పోటీగా నిలబడలేక పోతున్నారు.

సుమ యాంకర్ గా వ్యవహరిస్తున్న షోలలో క్యాష్ షో కూడా ఒకటి.ప్రతి శనివారం కొత్త కొత్త సెలబ్రిటీలను తీసుకుని వచ్చి సందడి సందడి చేస్తూ ఉంటుంది.

అయితే షో కి వచ్చిన గెస్ట్ లపై పంచుల వర్షం కురిపిస్తూ ఉంటుంది.కాగా ఈ నేపథ్యంలోనే గతవారం విడుదలైన చోర్ బజార్ టీమ్ తాజాగా క్యాష్ షోకి గెస్ట్లుగా వచ్చిన విషయం తెలిసిందే.

హీరో ఆకాష్ పూరి, హీరోయిన్ గెహ్నా సిప్పి, కమెడియన్లు రచ్చ రవి ఇమ్మాన్యుయేల్ వంటి వారు వచ్చారు.కాగా ఇప్పటికే రచ్చ రవి,ఇమ్మాన్యుయేల్ పలు సార్లు క్యాష్ షోకి వచ్చిన విషయం తెలిసిందే.

అయితే ఈసారి మాత్రం ఇమ్మాన్యుయేల్ రెచ్చిపోతూ సుమా పై పంచుల వర్షం కురిపించాడు.సుమ కూడా ఏ మాత్రం తగ్గకుండా ఇమ్మాన్యుయేల్ పై వరుస పంచులు వేస్తూ ఎంట్రీ ఇవ్వడంలోనే చెక్క బహుమతిగా ఇచ్చి సెటైర్ వేసింది.

ఆ తర్వాత స్కిట్లో భాగంగా సెల్ఫీల కోసం ఇగబడుతూ ఉంటారు.అందులో భాగంగా హీరోయిన్ పక్కన రచ్చ రవి,ఇమ్మాన్యుయేల్ బౌన్సర్లుగా నటించగా గెహ్నా సిప్పి హీరోయిన్  నటించేసింది.

  గెహ్నా సిప్పి తో ఫోటోలు దిగడానికి ఆకాష్ పూరి సుమ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.అప్పుడు బౌన్సర్లుగా ఉన్న ఇమ్మాన్యుయేల్ ఆకాష్ పూరి ని అడ్డుకుంటాడు.

అప్పుడు ఆకాశపురి ఎలా అయినా ఒక సెల్ఫీ ఇప్పించమని బ్రతిమలాడుతూ ఉండగా సుమ మాత్రంగెహ్నా సిప్పి  తో ఫోటో దిగడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది.అప్పుడు ఇమ్మాన్యుయేల్ పాపం ముసలావిడ మీతో సెల్ఫీ దిగడానికి ఎప్పటినుంచో ప్రయత్నిస్తుంది అంటూ సుమను ఉద్దేశించి దారుణంగా కౌంటర్ వేస్తాడు.ఆ మాటతో సుమ,ఇమ్మాన్యుయేల్ ఫోన్ లాక్కొని కిందకి విసిరేస్తుంది.అప్పుడు ఇమ్మాన్యుయేల్ వద్దు అంటూ పరిగెత్తుకుంటూ వచ్చినప్పటికీ లాభం లేకుండా పోతుంది.అయితే మరి ఆ ఫోన్ డమ్మీ ఫోనా లేకుంటే ఒరిజినల్ ఫోన్ నా అన్నది తెలియాలి అంటే వెయిట్ చూడాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube