పుష్ప సినిమాతో నటిగా రీఎంట్రీ ఇవ్వనున్న యాంకర్ సుమ

తెలుగు ఇండస్ట్రీలో పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు యాంకర్ సుమ.టెలివిజన్ రంగంలో నెంబర్ వన్ యాంకర్ గా దూసుకుపోతున్న ఈమె స్వతహాగా మలయాళీ అనే విషయం చాలా మందికి తెలియదు.

 Anchor Suma Play Key Role In Pushpa Movie, Tollywood, Director Sukumar, Allu Arj-TeluguStop.com

కెరియర్ ఆరంభంలో నటిగా ఎంట్రీ ఇచ్చి కొన్ని సినిమాలు, తరువాత సీరియల్స్ చేసిన సుమ తరువాత రాజీవ్ కనకాల ని పెళ్లి చేసుకొని స్పష్టంగా తెలుగు భాష మీద పట్టు సంపాదించి యాంకర్ గా కెరియర్ ఆరంభించి ఇప్పుడు టాప్ పొజిషన్ లోకి వచ్చేసింది.మెజారిటీ సినిమా ఫంక్షన్ లకి యాంకర్ గా ఫస్ట్ ఛాయస్ సుమనే ఉంటుంది.

సినిమా ఫంక్షన్ ని తన మాటలతో ఊపు తీసుకురావడంలో సుమ బెస్ట్ అనే అభిప్రాయం మన సినిమా ప్రముఖులలో ఉంది.అందుకే తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోతుంది.

యాంకర్ గా మారిన తరాత మరల వెండితెర మీద ఈమె కనిపించలేదు.

సినిమాలలో చేసేంత తీరిక సమయం కూడా ఆమెకి లేదు.

అయితే రెండు దశాబ్దాల తర్వాత మరల సుమ నటిగా చేయడానికి రెడీ అవుతుంది.అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కి అక్కగా సుమ నటించే అవకాశం ఉందని తాజా సమాచారం.

అందులో భాగంగా ఆమె ఇప్పటికే దీనికి సంబంధించి ఒప్పందం కూడా చేసుకుంది అని టాక్ నడుస్తుంది.రంగస్థలం సినిమాలో అనసూయ చేసిన రంగంమ్మత్త పాత్ర తరహాలోనే సుమ పాత్ర కూడా ఉండబోతుంది అని చెప్పుకుంటున్నారు.

మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే అఫీషియల్ గా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube