మేనకోడలిని సొంత కూతురులా చూసుకుంటున్న సుమ.. కారణం అదే!  

anchor suma taken her sister in law daughter responsibilities, anchor suma, Suma Sister in law Sri lakshmi, Sri lakshmi Death, Rajeev kanakala - Telugu Anchor Suma, Anchor Suma Taken Her Sister In Law Daughter Responsibilities, Ragaleena, Rajeev Kanakala, Sri Lakshmi Death, Srilakshmi, Suma, Suma Sister In Law Sri Lakshmi

బుల్లితెర టాప్ యాంకర్ గా దశాబ్ద కాలం నుంచి సుమ నంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నారు.సుమ ముందూవెనుక చాలామంది యాంకర్లు వచ్చినా వాళ్లెవరూ ఎక్కువ కాలం టీవీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేక పోయారు.

TeluguStop.com - Anchor Suma Sister In Law Daughter Raaga Video

కెరీర్ మొదట్లోసినిమాలు, సీరియళ్లలో నటించిన సుమ తరువాత కాలంలో టీవీ షోలతో పాపులర్ అయ్యారు.యాంకర్లలో అత్యధిక పారితోషికం అందుకునే యాంకర్ సుమనే కావడం గమనార్హం.
పెద్దపెద్ద స్టార్ హీరోలు తెలిసినా తెలియకపోయినా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుమ సుపరిచితం.అయితే ఆన్ స్క్రీన్ మీదే కాదు ఆఫ్ స్క్రీన్ పై కూడా సుమకు మంచి పేరు ఉంది.

వివాదాలకు దూరంగా ఉండే సుమ సమయస్పూర్తితో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.సుమ భర్త ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల అన్న సంగతి తెలిసిందే.అయితే గత మూడేళ్లుగా సుమ రాజీవ్ కుటుంబంలో వరుస విషాదాలు చోటు చేసుకున్నాయి.

TeluguStop.com - మేనకోడలిని సొంత కూతురులా చూసుకుంటున్న సుమ.. కారణం అదే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

మూడు సంవత్సరాల క్రితం రాజీవ్ తల్లి, 2019లో రాజీవ్ తండ్రి, ఈ సంవత్సరం రాజీవ్ చెల్లి శ్రీలక్ష్మి మరణించారు.

కొన్నేళ్ల క్రితం క్యాన్సర్ బారిన పడిన శ్రీ లక్ష్మి క్యాన్సర్ నుంచి కోలుకోలేక చనిపోయారు.ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో ఈ ఘటన చోటు చేసుకుంది.శ్రీలక్ష్మి, ఆమె భర్తకు ఇద్దరు అమ్మాయిలు సంతానం.ఎదిగే వయస్సులో తల్లి చనిపోవడంతో ఆ పిల్లలు పడిన ఆవేదన అంతాఇంతా కాదు.
దీంతో మేనత్త అయిన సుమ ఇద్దరు అమ్మాయిల బాధ్యతలు తీసుకుంది.తీరిక సమయాల్లో వారికి సమయం కేటాయిస్తూ వారి ఆలనాపాలనా చూసుకుంటోంది.తాజాగా సోషల్ మీడియాలో సుమ తన మేనకోడళ్లలో ఒకరైన రాగలీనకు సుమ భోజనం తినిపిస్తూ ఉన్న వీడియో వైరల్ అవుతోంది.తల్లి లేని పిల్లలను సొంత కూతుళ్లలా చూసుకుంటున్న సుమపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

#Ragaleena #Anchor Suma #Rajeev Kanakala #SumaSister #AnchorSuma

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Anchor Suma Sister In Law Daughter Raaga Video Related Telugu News,Photos/Pics,Images..